Wednesday, May 1, 2024

కమర్షియల్‌ వినియోగానికి 42 బొగ్గు బ్లాకుల వేలం : కేంద్ర ప్రభుత్వం..

కమర్షియల్‌ మైనింగ్‌ కోసం ఇప్పటి వరకు మొత్తం 42 బొగ్గు బ్లాకులను వేలం వేయగా.. వీటిలో 10 నిలలను గత వారం మూడో విడత కింద వేలం వేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ రౌండ్‌లో విజయవంతమైన బిడ్డర్‌లలో జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. గత వారం జరిగిన వేలంలో మొదటి రోజున ఐదు బ్లాక్‌లు అమ్ముడుపోయాయి. ఇక్కడ దాల్మియా సిమెంట్‌ భారత్‌ లిమిటెడ్‌ జార్ఖండ్‌లోని రెండు బొగ్గు బ్లాకులకు అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. మహానది మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ ఒడిశాలోని బొగ్గు బ్లాకుకు అత్యధిక బిడ్డర్‌గా నిలిచాయని, తూర్పు రాష్ట్రంలోని మరో బొగ్గు గని కోసం యజ్దానీ స్టీల్‌ అండ్‌ పవర్‌ అత్యధిక బిడ్డర్‌గా నిలిచిందని బొగ్గు మంత్రిత శాఖ తెలిపింది.

వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియ కింద.. ట్రాంచ్‌-3లో వేలం వేసిన గనులతో సహా మొత్తం 42 బొగ్గులు ఇప్పటి వరకు సంవత్సరానికి 86.404 మిలియన్‌ టన్నుల మొత్తం కల్టిమెటీవ్‌ పీక్‌ రేట్‌ సామర్థ్యంతో విజయవంతంగా వేలం వేయబడ్డాయని బొగ్గు మంత్రిత్వ శాఖ వివరించింది. గత వారం విక్రయించిన 10 బ్లాకులు వార్షికంగా రూ.2,858.20 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలవని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండు, మూడో రోజు వేలంలో.. జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ ఒడిశాలోని ఉత్కల్‌-సీ బొగ్గు గనిని కొనుగోలు చేయగా.. హిందాల్కో ఇండస్ట్రీస్‌ రాష్ట్రంలోని మీనాక్షి గని కోసం అత్యధిక బిడ్‌ను దాఖలు చేసింది. మహారాష్ట్రలోని మజ్రా గని కోసం బీఎస్‌ ఇస్పాత్‌ లిమిటెడ్‌ అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. అసోంలోని గరంపానీ కోల్‌ బ్లాక్‌ను అసోం లిమిటెడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కైవసం చేసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement