Thursday, May 2, 2024

భారతీయ అమెరికన్‌ విద్యార్థిపై దాడి.. వైర‌ల్ గా వీడియో

టెక్సాస్ : టెక్సాస్‌లో భారతీయ అమెరికన్‌ విద్యార్థిని వేధింపులకు గురిచేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో ఆగ్రహానికి, విమర్శలకు దారితీసింది. ఈ సంఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థి వీడియో తీసి ఆన్‌లైన్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌ అయింది. ఈ వీడియో ప్రకారం ఒక బెంచీపై కూర్చున్న భారతీయ అమెరికన్‌ అబ్బాయి దగ్గరకు అమెరికన్‌ విద్యార్థి వచ్చి లేచి నిలబడమని అడిగినట్లు వుంది. కూర్చున్న విద్యార్థి లేవడానికి నిరాకరించడంతో అమెరికన్‌ విద్యార్థి కోపంగా అతని మెడచుట్టూ మోచేతిని బిగించి, మెడను నొక్కి ఊపిరి ఆడకుండా చేసి, తలను వెనక్కు వంచాడు. ఈ సంఘటన టెక్సాస్‌లోని కొప్పెల్‌ మిడిల్‌ స్కూల్‌లో జరిగింది. ఈ సంఘటన గురించి ఆ స్కూల్‌ సూపరింటెండెంట్‌ డా.బ్రాడ్‌హంట్‌ ”కోపెల్‌ మిడిల్‌ స్కూల్‌ నార్త్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణను చూపించే వీడియో సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోందని కొప్పెల్‌ ఐఎస్‌డికి తెలుసు. బెదిరింపులు, అరవడం, శారీరకంగా హింసించడంలాంటి చర్యలు ఎప్పటికీ ఆమోద యోగ్యం కాదు.

మేము మా ప్రధాన విలువలతో ఏకీభవిస్తాము.” అంటూ ఇమెయిల్‌ పెట్టాడు. ఈ సంఘటనపై స్కూల్‌ నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతోంది. చాలామంది వీడియోలో దాడిని స్పష్టంగా చూపించారనే వాస్తవాన్ని ఎత్తి చూపడంతో విస్తృతంగా విమర్శలు వచ్చాయి. ఎన్‌బిసిడిఎఫ్‌డబ్ల్యు ప్రకారం వేధింపులకు గురైన విద్యార్థి తల్లిదండ్రులు తమ కొడుకు తిరిగి పోరాడాలని, అమెరికన్‌ విద్యార్థిని ఇబ్బందుల్లో పెట్టాలని అనుకోలేదని, అయినా కూడా తమ కొడుకును మూడురోజులు సస్పెండ్‌ చేశారని, దాడిచేసిన విద్యార్థిని ఒక రోజే సస్పెండ్‌ చేశారని అంటున్నారు. పాఠశాల అంతర్గత విచారణ చేయడానికి వేచి ఉన్నందున తల్లిదండ్రులు ఇప్పుడు న్యాయపరమైన ప్రాతినిథ్యాన్ని కోరారు. ఇండియన్‌ అమెరికన్‌ విద్యార్థికి మద్దతుగా 1,50,000 మందికి పైగా సంతకాలు చేసిన ఆన్‌లైన్‌ పిటిషన్‌ కూడా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement