Thursday, May 2, 2024

జూన్ 13న ట్రిబెకా ఫెస్టివల్‌లో.. ఆదిపురుష్

స్టార్ హీరో ప్ర‌భాస్ ప‌లు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నాడు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో ఆదిపురుష్ ఒక‌టి. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆది నుంచి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పోస్టర్‌ల నుండి టీజర్‌ల వరకు ప్రతీది బోలెడు విమర్శలు తెచ్చిపెట్టాయి. పోస్టర్‌ల నుండి టీజర్‌ వరకు ప్రతీది బోలెడు విమర్శలు తెచ్చిపెట్టాయి. ఒక వర్గానికి చెందిన ప్రేక్షకులైతే ఏకంగా సినిమా రిలీజ్‌ను ఆపేయాలని డిమాండ్‌ కూడా చేశారు. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్‌పై ఎక్కడలేని విమర్శలు వచ్చాయి. దాంతో మేకర్స్‌ మరో వంద కోట్లతో మెరుగైన వీఎఫ్‌ఎక్స్‌ను పునరుద్ధరిస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదలకు ముందే అరుదైన ఘనతను సాధించింది. సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ట్రిబెకా ఫెస్టివల్‌లో ఆదిపురుష్‌ సినిమాను ప్రదర్శించబోతున్నారు. న్యూయార్క్‌లో జరిగే ఈ ప్రఖ్యాత కళల ఉత్సవంలో జూన్‌ 13న ఆదిపురుష్‌ సినిమా ప్రదర్శితం కాబోతుంది. ఇదే విషయాన్ని ఓరౌత్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇది గౌరవం, సంతోషానికి మించింది. ఆదిపురుష్ మూవీ జూన్ 13న ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రదర్శితం కాబోతుంది. ఈ సినిమాను ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరి మెంబర్స్‌కు నా ధన్యవాదాలు. ఆ వేడుక కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నా అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement