Friday, May 3, 2024

Asia cup | 25 నుండి ఆన్‌లైన్ లో టికెట్ల అమ్మ‌కాలు

ఈ నెల 31 నుండి ఆసియా ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గ‌నుండ‌గా క్రికెట్‌ అభిమానులకు ICC గుడ్‌న్యూస్ తెలిపింది. ODI ప్రపంచ కప్ 2023 టిక్కెట్ల విక్రయాల రిజిస్ట్రేష‌న్ ను ఇవ్వాల (మంగళవారం) నుండి ప్రారంభింస్తోన్న‌ట్టు ప్ర‌క‌టించింది. కాగా, టికెట్లు కావ‌ల‌నుకునే వారు https://www.cricketworldcup.com/register వెబ్‌సైట్లోకి వెళ్లి వారి పేరు నమోదు చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల అందరికన్నా ముందు టికెట్ల సమాచారం మీకే వస్తుంది. దాంతో సులువగా టికెట్లు పొందొచ్చు. అలాగే అభిమానుల నుంచి డిమాండ్‌ను అంచనా వేయడానికి నిర్వాహకులకు వీలవుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లు, ఆటగాళ్లు తలపడే ఈ పోటీలను వీక్షించేందుకు ఫ్యాన్స్ నుంచి ఎంత పోటీ ఉంటుందో తెలిసిందే.

ప్ర‌స్తుతానికి టిక్కెట్‌ల రిజిస్ట్రేషన్ ప్రారంభమైన‌ప్ప‌టికీ, ఆగస్టు 25 వ‌ర‌కు ఇవి అందుబాటులోకి రావు. ఇక‌, టీమ్‌ఇండియా మినహా మిగతా అన్ని మ్యాచుల టికెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి మొదలవుతుంది. మొదట వార్మప్‌ ఆ తర్వాత లీగ్‌ మ్యాచుల టికెట్లు అమ్ముతారు. ఆపై ఆరు దశల్లో టీమ్‌ఇండియా తలపడే మ్యాచుల టికెట్లు ఇస్తారు. సెప్టెంబర్‌ 30న గువాహటిలో ఇంగ్లాండ్‌, అక్టోబర్‌ 3న తిరువనంతపురంలో శ్రీలంక లేదా నెదర్లాండ్స్‌తో రోహిత్‌ సేన వార్మప్‌ మ్యాచులు ఆడుతుంది. మొదట ఈ పోటీల టికెట్లు అమ్ముతారు.

- Advertisement -

CWC23 టిక్కెట్ విక్రయాలు

ఆగస్టు 25: టీమ్‌ఇండియా మినహా మిగతా జట్ల వార్మప్‌, లీగ్‌ మ్యాచులు టికెట్ల విక్రయం
ఆగస్టు 30: గువాహటి, తిరువనంతపురంలో టీమ్‌ఇండియా ఆడే వార్మప్‌ మ్యాచుల టికెట్ల విక్రయం
ఆగస్టు 31: ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా మ్యాచుల టికెట్ల విక్రయం
సెప్టెంబర్ 1: న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, శ్రీలంకతో టీమ్ఇండియా మ్యాచుల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్‌ 2: దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో టీమ్‌ఇండియా మ్యాచుల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్‌ 3: అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌లో భారత్‌ x పాకిస్థాన్ మ్యాచు టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్‌ 15: సెమీ ఫైనల్స్, ఫైనల్‌ మ్యాచు టికెట్ల అమ్మకాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement