Friday, May 3, 2024

Aryan khan: బెయిల్ వచ్చినా.. జైల్లోనే!

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇంకా జైలులోనే ఉన్నాడు. డ్రగ్స్ కేసులో బాంబే హైకోర్టు ఆర్యన్ కు నిన్ననే బెయిల్ మంజూరు అయినప్పటికీ ఇంకా ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైల్లోనే ఉన్నారు. బెయిల్ ప్రక్రియలో జాప్యం జరగడంతోనే ఆర్యన్ విడుదల ఆలస్యం అవుతోంది. నిబంధనల ప్రకారం జైల్లో అన్నీ పూర్తయిన తర్వాత ఆర్యన్ విడుదల అవుతారు.

కాగా, డ్రగ్స్ కేసులో భాగంగా అక్టోబర్ 3న పోలీసులు ఆర్యన్ ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సార్లు బెయిల్‌ నిరాకరించడంతో నాలుగో సారి ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్న తరుణంలో బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. దాంతో షారుక్ ఖాన్ కుటుంబం ఊపిరి తీసుకుంది. తమ కుమారుడి విడుదల కోసం షారుఖ్, ఆయన భార్య గౌరీ ఖాన్ ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవిండి: తెలంగాణ సర్కార్ కు షాక్.. పాలమూరు-రంగారెడ్డి పథకానికి బ్రేక్!

Advertisement

తాజా వార్తలు

Advertisement