Sunday, May 19, 2024

Big story | అమ్మ కోసం అరుంధతి ఆసుపత్రి… వైద్య పరీక్షల నుండి ఆపరేషన్ల వరకు అన్నీ ఉచితమే

లక్షలు కుమ్మరిస్తే కానీ మెరుగైన వైద్యం అందని ఈ రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రిలో లభించే అన్ని రకాల వైద్య పరీక్షలు, ఇన్-ఔట్ పేషేంట్ వైద్య సేవలు మేజర్ సర్జరీలు, గుండె శస్త్ర చికిత్సలు, బై-పాస్ సర్జరీలు, స్టెంట్లు, కిడ్నీ డయాలసిస్ లు, పేగు క్యాన్సర్, క్లోమ గ్రంధి, ఎండో స్కోపి, కొలనొస్కోపి, నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మేంట్, స్పైన్ రీప్లేస్మెంట్, ఆర్థోస్కోపి సర్జరీ, షోల్డర్, నీ జాయింట్, ట్రోమా ఫ్యాక్చర్ బేసిస్, స్పైన్ , బ్రెయిన్, సర్జరీలు ఇలా 24 రకాల అత్యాధునిక వైద్య సేవలను పైసా ఖర్చులేకుండా నగర శివారు లోని దుండిగల్ మున్సిపాలిటీ కేంద్రంలో గల అరుందతిలో ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్నారు. వైద్యో నారాయణ హరి అన్న సూక్తిని ఒంటబట్టించుకుని, సి ఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న పథకాల ప్రేరణ కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తి, అమ్మ కోరిక మేరకు మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ ఎస్ ఇంచార్జి డాక్టర్ మర్రి రాజశేఖర్ రెడ్డి అరుందతి ఆసుపత్రి నెలకొల్పి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. 24 గంటల పాటు ఉచితంగా అందిస్తున్న సేవలతో ప్రజలకు పైసా ఖర్చులేకుండా మెరుగైన వైద్యం అందుతుంది.

కుత్బుల్లాపూర్, ( ప్రభ న్యూస్) సంకల్పం ఉన్నతమైనదై చేసే కార్యం అందరికి ఉపయుక్తమైనదైతే భగవంతుడి ఆశీస్సులు కూడా తోడై శ్రీకారం చుట్టిన సంకల్పం- చేయదలచిన కార్యం దిగ్విజయమై అందరిచేత ఆశీర్వదించబడుతుంది. దుందిగల్ లోని అరుంధతి ఆసుపత్రి ప్రస్థానం కూడా అదే కోవలోకి వస్తుంది.

ఓ ఆసుపత్రి ఏర్పాటుకు కుమారుడి కాంక్షను అర్ధం చేసుకున్న ఓ తల్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా చిరకాలం గుర్తుండి పోయేవిధమైన కార్యం చేయాలని భోదించిన సమయంలో పురుడుపోసుకుందే దుందిగల్ లోని ఆయుదంతి ఆసుపత్రి. ఆ కుమారుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆ తల్లి అరుంధతి.. అలా రెండున్నర సంవత్సరాల క్రితం ప్రాణం పోసుకున్న ఆసుపత్రి నేడు ఎందరో పేద-మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందిస్తుంది. రోగిగా ఆర్తితో అరుంధతి ఆస్పత్రికోచ్చి నయమై తిరిగి వెళ్తూ ఆ కుమారుడు, ఆ తల్లికి ప్రజలు దీవెనర్తులు ఇచ్చి నిండు-నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.

మర్రి రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

- Advertisement -

అరుందతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్పొరేట్ కు ధీటుగా ఉచితంగా వైద్య పరీక్షలు- చికిత్సలు అందిస్తున్నారు. ఉచితంగా ECG, 2D Echo , క్యాత్ ల్యాబ్ పరీక్షలు, చేసుకొనే అవకాశం కల్పించారు.నిష్ణాతులు అయిన కార్డియాలజీ వైద్య బృందం నేతృత్వంలో అన్ని రకాల వైద్య పరీక్షల తో పాటు నిరంతర వైద్య సహాయాన్ని అందిస్తున్నారు.

అరుందతి ఆసుపత్రిలో ఎంతో వ్యయంతో కూడిన వైద్య పరీక్షలు MRI స్కానింగ్,CT స్కాన్, అల్ట్రా సౌండ్ స్కానింగ్,X Ray, ఎండోస్కోపీ, డయాలసిస్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. అంతేకాకుండా దృష్టి లోపాలను గుర్తించి వారికి దృష్టి లోపాలను సరిచేయడం కోసం గౌరవ రాష్ట్ర సి ఎం కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని కంటి విభంగంలో ఉచిత,శస్త్ర చికిత్సలు మరియు కళ్ళ అద్దాలు అందిస్తున్నారు.

అరుందతి హాస్పిటల్ లోని గైనకాలజి విభాగంలో మాత శిశు సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఇక్కడ అన్ని రకాల వైద్య సదుపాయాలు లా ప్రోస్కాపీ సర్జరీ, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ,ఫ్యామిలీ ప్లానింగ్ తదితర అన్ని రకాల వైద్య సేవలు అందిస్తోంది.వీటితో పాటు అందుబాటులో ఉన్న ఇతర అన్ని రకాల వైద్య సేవలను అరుంధతి ఆసుపత్రి వర్గాలు పైసా ఖర్చులేకుండా కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా అందిస్తుంది.

అరుంధతీ లో ఉచిత వైద్య సేవలు

1) జనరల్ మెడిసిన్,విబాంగంలో వెంటిలేటర్ తో కూడిన MICU వైద్య సదుపాయం.
2) ప్రత్యేక న్యూరాలజీ విభాంగం
3) డయాబెటాలజీ
4) పల్మనాలజీ
5) డెర్మటాలజీ ఇందులో కాస్మోటాలజీ , హైర్ఫాల్ ట్రీట్మెంట్,తో పాటు అన్ని రకాల చర్మ వ్యాధుల చికిత్స కొరకు అన్ని రకాల వైద్య సదుపాయాలు.
6) గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం
7) పిల్లలకు ఉచిత వైద్య సహాయాన్ని అందించాలనే సంకల్పంతో NICU, PICU (నియోనాటల్) సేవలు అందిస్తున్నారు..
8) డెంటల్ విభాగంలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ , టూత్ ఎక్స్త్రాక్షన్ ,తదితర చికిత్సలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు .
9) జనరల్ సర్జరీ & ల్యాప్రో స్కోప్ విభాగం.
10) అర్తోపెడిక్స్&ఆర్తోస్కోపీ విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జాయింట్ రీప్లేస్మెంట్, ట్రామా కేర్ తదితర అత్యాధునిక వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.
11) యూరాలజీ విభాగం, నెఫ్రాలజీ & డయాలసిస్ ప్రత్యేకంగా నెలకొల్పారు. 12)ENT విభాగం లో స్పీచ్ థెరపీ , ఆడి యోమెట్రీ , తదితర వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
13) రేడియాలజీ విభాగం( MRI,CT,X Ray, మ్యామో, అల్ట్రా సౌండ్.
14) ప్యాతాలజీ 15) బ్లడ్ బ్యాంక్
16) మైక్రోబయాలజీ, వైరాలజీ విభాగం.
17) సైకియాట్రీ విభాగం.
18) 24 గంటల పాటు ఉచిత అంబులెన్స్ సేవలు.
19) 24/7 ఎమర్జెన్సీ వైద్య సేవలు
20) అనేస్తీస్యాలజీ
21) కార్డియోతోరాసిక్ సర్జన్ 22) కార్డియాలజీ విభాగంలో ఈ సీజీ, ట్రెడ్మిల్, 2D ఏకో, క్యాత్ ల్యాబ్ తదితర విభాగాలు ప్రత్యేకంగా నెలకొల్పి 24 గంటలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు ఉచితంగా అందిస్తున్నారు. ప్రజలకు వైద్య సలహాలు- సూచనల మేరకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. కింది నెంబర్ కు ఫోన్ చేసి ఎలాంటి వైద్య సహాయం కావాలన్నా వివరాలను అడిగి తెలుసుకోవచ్చు.+91 93983 24548

అరుంధతి అస్పత్రి లో జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు

మేడ్చల్ జిల్లా అధ్యక్షులు జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం అత్యాధునిక వైద్య సదుపాయాలతో అరుంధతి ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది. ఇప్పటికే 70 మంది జర్నలిస్టులకు గుండె, లివర్, కిడ్నీ లకు సంబంధించి 2డి ఈకొ, ఈసిజి, ఆల్ట్రా స్కానింగ్, లతొ పాటు 20 రకాల పరీక్షలు ఉచితంగా చేశారని పేర్కొన్నారు. వైద్య పరీక్షలతో పాటు పలువురు ఉచితంగా వైద్య సేవలను పొందరన్నారు. పైసా లేనిదే వైద్యం చేయని ఈ రోజుల్లో మర్రి రాజశేఖర్ రెడ్డి లాంటి మనసున్న నేతలు ముందుకు వచ్చి ఉచితంగా వైద్య సేవలు అందించడం గొప్ప విషయమన్నారు.

అరుంద‌తిలో ఉచిత వైద్య సేవ‌లు బేష్‌.. ఎమ్మెల్యే కేపి

దుండిగ‌ల్‌లోని అరుంద‌తి ఆస్ప‌త్రి అత్యాధునిక‌మైన వైద్య ప‌రిక‌రాల‌తో ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అందిస్తున్న వైద్య సేవ‌లు అభినంద‌నీయం. అరుంద‌తి ఆస్ప‌త్రిలో అత్యాధునిక వైద్య సేవలు కొలువుదీరాయి. అత్యాధునిక వైద్య సేవల ద్వారా ప్రజలు ఉచిత సేవలు పొందుతూ తరిస్తున్నారు. ర‌క్త‌ప‌రీక్ష‌ల‌తో పాటు సిటి స్కాన్‌, ఎంఆర్ ఐ సేవ‌లు, ఇలా 24 రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలను అరుంధతి లో అందిస్తున్నారు. మ‌ల్కాజిగిరి పార్ల‌మెంట్ బిఆర్ ఎస్ ఇంచార్జి, అరుంధతీ ఆసుపత్రి సెక్రటరీ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఉచిత వైద్య సేవ‌ల‌ను అందించ‌డం గొప్ప విష‌యం అన్నారు. భవిష్యత్ లో పేద‌ల‌కు ఆరోగ్య సంజీవినిలా అరుంద‌తి ఆస్ప‌త్రి కచ్చితంగా నిలుస్తుంది.

అమ్మ కోరిక మేరకే: మర్రి రాజశేఖర్ రెడ్డి

మా అమ్మ అరుంధతమ్మ కోరిక మేరకే దుండిగల్ లో ఆమె పేరుతో ఉచిత ఆసుపత్రి ఏర్పాటు చేశాం. ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని ఇంట్లో చర్చ జరిగి అమ్మ పేరు మీద ఆసుపత్రి పెట్టాలని నా మనసులోని కోరిక అమ్మకు చెప్పా. అమ్మ ఒక్కటే చెప్పింది.. బిడ్డా ఈ ప్రపంచంలో ఎవరైనా సంపాదిస్తారు. సంపాదనతో పాటు సార్ధకత- జీవిత పరమార్థం కూడా సంపాదించుకో నాయనా అంటూ నా పేరు మీద ఆసుపత్రి పెడుదామని అంటున్నావు బాగానే ఉంది కాని అది అన్ని వర్గాల ప్రజాలకేజ్ ఉచిత వైద్య సేవలు అందించేదైతేనే నా పేరు మీద పెట్టు అంటూ ఖరాఖండిగా చెప్పింది.

అమ్మ ఎందుకు అలా చెప్పిందని ఆలోచించి నేను, నా సతీమణి, పిల్లలం ఆలోచించి ఇప్పటికే వైద్య రంగంలో ఎంతో పేరు-ప్రఖ్యాతలు సంపాదించాం. ఇక చాలు.. ప్రజలకు ఉచితంగా చిల్లి గవ్వ లేకుండా ఎంత పెద్ద రోగనికైనా మన(అరుంధతీ) ఆసుపత్రిలో చికిత్స అందించే విధంగా ఏర్పాటు చేయాలని సంకల్పించి రెండున్నర సంవత్సరాల క్రితం పురుడుపోశాం. రెండున్నర సంవత్సరాలలో 4 లక్షల రోగులకు 4 వేల మేజర్ సర్జరీలు, 3 వేల నార్మల్ సర్జరీలు అనేక రకాల ఉచిత పరీక్షలు అందించి అన్ని రకాల ప్రజలకు ఆరోగ్య స్వఅంతన చేకూర్చామ్. భగవంతుడు మరింత శక్తి ఇస్తే.. అతి పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో అరుంధతి ఆసుపత్రిని తీర్చి దిద్దుతాం.

ఎంతో సంతృప్తిగా ఫీల్ అవుతున్నా డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి( ఎండి డి ఎం)

అరుంధతి ఆసుపత్రి ప్రారంభించిన దగ్గరి నుండి నేను కార్డియాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నా. గతంలో యశోద ఆసుపత్రిలో పనిచేశా. అరుంధతీ లో డాక్టర్ గా పనిచేయడం ఎంతో హ్యాపీగా ఉంది. ఓ డాక్టర్ రోగికి వైద్యం అందించాలంటే స్వేచ్చా- స్వాతంత్ర్యత ఎంతో అవసరం. పేషేంట్ పరిస్థితి- ఎమర్జెన్సీ బట్టి ఒక్కోసారి వైద్యుడు యాజమాన్యంతో సంబంధం లేకుండా ఎలాంటి నిరీక్షణ-అనుమతి లేకుండా పరీక్షలు అందించినప్పుడే రోగికి సకాలంలో వైద్యం అందించి వారి ప్రాణాలు నిలబెట్టవచ్చు. అరుందతిలో ఈ కంఫర్ట్ ఉంది. నేను ఇక్కడ పనిచేస్తున్నప్పటి నుండి 51 అంజియోగ్రామ్, అంజియో ప్లాస్టిక్ అపరేషన్లు చేశాను. 5 బైపాస్ సర్జరీలు కూడా చేశాం. ఇదంతా ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే ప్రజలకు వైద్యం అందించాం. ఇదంతా మేనేజ్మెంట్ కృషే.. రియల్లీ రాజశేఖర్ రెడ్డి సార్ ఏ డైనమిక్ పర్సన్. హ్యాట్సాఫ్ టు హిమ్.

అరుందతిలో ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు డాక్టర్ ఉదయ్ కుమార్ ఆర్థోపెడిక్ సర్జన్
అరుంధతి ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ఉచిత వైద్య సేవలు ఇక్కడి ప్రజలకు అందుతున్నాయి. ఒక్కరూపాయి ఖర్చు లేకుండా అరుంధతి లో ఆర్థో సేవలు రోగులకు అందుతున్నాయి. ముక్యంగా నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్, స్పైన్ రీప్లేస్మెంట్, ఆర్థో స్కోపి సర్జరీ, షోల్డర్ , నీ జాయింట్, ట్రోమా ఫ్యాక్చర్ బేసిస్ ఇలా రకరకాల ఆర్థో వైద్య సేవలు ఇక్కడ లభ్యమవుతున్నాయి.

నాకు మరోజన్మ ఇచ్చారు: చిట్టమ్మ, నర్సాపూర్

10 సంవత్సరాల క్రితం నాకు రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ నుండి హైదరాబాద్ కు ఆటోలో వెళ్తున్నాను. ఈ క్రమంలో ఆటో బోల్తా పడింది. నా తల వెనుక భాగంలో తీవ్ర గాయం అయ్యింది. అప్పట్లో సర్కార్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని మందులు వాడా. అయితే క్రమంగా నా తల వెనుక భాగం పెరగడం మొదలైయింది. పెద్ద పెద్ద ఆసుపత్రిలో చేయించాం. లక్షలు పెట్టందే బాగు కాదు అని చెప్పారు.

నా బిడ్డకు ఎవరో మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి సారు ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నాడని చిల్లి గవ్వ కూడా తీసుకోడని చెప్పారట. వచ్చి తెలుసుకున్నాం. జాయిన్ కావాలని చెప్పారు. మర్రి రాజశేఖర్ రెడ్డి సార్ దయతో నాకు ఉచితంగా శాస్త్ర చికిత్స చేశారు. తల వెనుక భాగంలో ఎముక పెరిగిందని దానిని తీసివేశారు. ఇప్పుడు కుదుట పడ్డాను. 5 రోజుల క్రింద ఆపరేషన్ చేశారు. నాకు నయం అయ్యింది. అపరేషన్ కాక ముందు చిన్న సౌండ్ విన్నా తల పగిలిపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజశేఖర్ రెడ్డి సార్ నాకు మరో జీవితాన్ని ప్రసాదించాడు. ఆయన కలకాలం చల్లగా ఉండాలి. ఆ దేవుడు చల్లగా చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement