Monday, May 6, 2024

మరోసారి భారీగా పెరిగిన కేసులు….

ఏపీలో రోజువారి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది… అస్సలు తగ్గుముఖం పట్టడంలేదు. తాజాగా ఏపీ గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,050 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,82,308 కు చేరింది. ఇందులో 19,48,828 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 19,949 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 18 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 13,531 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 2,458 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 85,283 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: ప్రెగ్నెంట్ అవ్వాలి నాభర్తని పంపించండి అని కోర్టుకెక్కిన మహిళ

Advertisement

తాజా వార్తలు

Advertisement