Monday, April 29, 2024

అనుభ‌వించు రాజా ట్రైల‌ర్ రిలీజ్ చేసిన ‘నాగార్జున‌’..

చాలా రోజుల త‌ర్వాత రాజ్ త‌రుణ్ హీరోగా వ‌స్తోన్న చిత్రం అనుభ‌వించు రాజా..ఈ మూవీ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ ని హీరో నాగార్జున రిలీజ్ చేశారు. అన్న‌పూర్త స్టూడియోస్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనివాస్ గ‌విరెడ్డి తెర‌కెక్కించాడు.విలేజ్ లో పక్కా మాస్ కుర్రాడు అనిపించుకున్న హీరో, హీరోయిన్ కోసం ఆమె పని చేస్తున్న కంపెనీ సెక్యూరిటీ గార్డుగా మారతాడు. ఆమెను రోజూ చూడొచ్చు .. మాట్లాడొచ్చు అని అలా ప్లాన్ చేశాడనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమాలో విలన్ అజయ్.. బంగారంగాడి మనసు సినిమా హాల్ లాంటిది .. వారానికో సినిమా వత్తావుంటది .. పోతావుంటది .. ఏదీ పర్మినెంట్ గా ఆడదు ఇక్కడ” అనే రాజ్ తరుణ్ డైలాగ్, “మనం గెలవాలంటే వాడి పుంజు ఈ బరిలో ఉండకూడదు .. వాడు ఈ ఊళ్లో ఉండకూడదు” అనే అజయ్ డైలాగ్ వాళ్ల పాత్రల స్వభావాలను చెప్పేస్తున్నాయి. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాజ్ త‌రుణ్ మార్క్ ఈ చిత్రంలో క‌నిపిస్తోంది. మ‌రి రాజ్ త‌రుణ్ కి ఈ చిత్రం విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement