Friday, April 26, 2024

Big Story | మంజీరాపై మరో ఎత్తిపోతల నాగమడుగు.. ఏడాదిలోగా పూర్తిచేసేంకు సన్నాహాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గరుడగంగ గా ప్రఖ్యాతి గాంచి అనేక నాగరికతలకు జీవంపోసిన మంజీరా నదిపై మరో ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధంచేసింది. నాగమడుగు ఎత్తిపోతల పథకంపేేరుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో నీరు అందని ఎగువప్రాంతాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి భూసేకరణలో నిమగ్నమైంది.

మంజీరానది పరివాహక ప్రాంతాల్లో అనేక నాగరికతలు విరాజిల్లడంతోపాటుగా ఆనాదిగా వేలాదిఎకరాల భూములకు సాగునీరు అందిస్తున్న జీవనది. మహారాష్ట్రలో పుట్టిన నది కొండకోనలను దాటుకుంటూ అనేక జలాశయాలను, చెరువులను నింపకుంటూ 724 కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్‌ జిల్లాలోని రెంజల్‌ మండలంసోని కందకుర్తి దగ్గరగోదావరిలో కలుస్తోంది. మంజీరా నదిపై మెదక్‌ జిల్లాలోని ఘన్‌ పూర్‌ ఆనకట్ట ద్వారా 5వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టలు, జలాశయాలద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది.

- Advertisement -

మహారాష్ట్రలోని బాలాఘాట్‌ పర్వతాలల్లో పుట్టిమహారాష్ట్ర,కర్ణాటక ల నుంచి ప్రవహించి సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల ద్వారా ప్రవహిస్తూ సాగునీరు అందిస్తోంది. సుమారు 30వేల 800 చదరపుకిలోమీటర్ల పరివాహక ప్రాంతం కలిగిన ఈ నది పై నిజాం సాగర్‌, ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టు నిర్మాణాలు జరిగాయి, చరిత్రలోమంజీరా నదిని గరుడగంగ గా ప్రఖ్యాతిగాంచింది. హైదరాబాద్‌ కు తాగునీరు అందించే సింగూరు రిజర్వార్‌ నిర్మించారు.

మంజీరా నదిపై నాగమడుగుఎత్తిపోతల పథకం పేరుతో నిజాం సాగర్‌ దిగువన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మల్లూరు దగ్గర ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వడంతో పాటుగా నిధులను సమకూర్చింది. నాగమడుగు ఎత్తిపోత పథకం ద్వారా 30వేల 646ఎకరాల యకట్టుకు సాగు నీరు అందించడంతో పాటుగా కామారెడ్డి జిల్లాలో పిట్లం, బిచ్కుంద, నిజాంసాగర్‌ మండలాలలోని కరువు పీడిత ప్రాంతాల చిన్న నీటి జలాశయాలను మంజీరా జలాలతో నింపడం ఈ ప్రాజెక్టు లక్ష్యాల్లో ప్రధానమైంది.

నాగమడుగు ఎత్తిపోతల పథకానికి కామారెడ్డి జిల్లా నిజాం సాగర్‌ మండలం మల్లూరు గ్రామం నిజాం సాగర్‌ డ్యామ్‌ దిగువన మంజీర నది నుంచి నీటిని ఎ్తతి పోయడం కోసం బ్యారేజి నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్‌ 106 ద్వారా రూ.476.25 కోట్లతో పరిపాలనా అనుతులు ఇచ్చింది. భూసేకరణ,ప్రాజెక్టు డిజైనింగ్‌ డీపీఆర్‌ ఏర్పాటుకు ఇప్పటివరకు రూ.14 కోట్లు ఖర్చు అయ్యాయి ప్రాజెక్టు నిర్మాణంతో 40వేల 768 ఎకరాలు సాగులోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement