Wednesday, May 15, 2024

Cheetah | కునోలో మరో ఆడ చిరుత దక్ష మృతి.. ప్రాజెక్టు చీతాకి ఇది పెద్ద దెబ్బ!

దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతలలో ఇవ్వాల (మంగళవారం) మరొకటి చనిపోయింది. కునో నేషనల్ పార్క్ లో రెండు నెలల్లో చీతాలు చనిపోవడం ఇది మూడోసారి. ఈ చిరుత మృతితో ప్రాజెక్టు చీతాకు పెద్ద ఎదురుదెబ్బ అని పరిశీలకులు అంటున్నారు. చనిపోయిన చిరుతను దక్ష అనే ఆడచీతాగా గుర్తించారు. దక్ష మరణం కునో నేషనల్ పార్క్ నిర్వహణపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అంతకుముందు.. కునోలోఉన్న రెండు చిరుతలు ఉదయ్, సాషా కూడా చనిపోయాయి. ఇతర చిరుతలతో జరిగిన పోరాటంలో దక్ష చనిపోయి ఉంటుందనే ఆరోపణలున్నాయి.

దక్షిణాఫ్రికా నుండి తీసుకువచ్చిన ఆడ చిరుత దక్ష కునో నేషనల్ పార్క్ లో చనిపోవడం బాధాకరమని, ఇది ఇప్పటివరకు మూడో మరణం అని మధ్యప్రదేశ్​ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ JS చౌహాన్ తెలిపారు. భారత్​కు నమీబియా నుంచి 12 చిరుతలను తీసుకొచ్చారు. అంతకుముందు కిడ్నీ ఫెయిల్యూర్‌తో సాషా అనే మరో చిరుత మృతి చెందింది. కునో నేషనల్ పార్క్ లో రెండో చిరుత మరణించిన తర్వాత.. దక్షిణాఫ్రికా అటవీ, మత్స్య, పర్యావరణ శాఖ (DFFE) ఈ తరహా ప్రాజెక్ట్ లో చిరుతల మరణాలు ఊహించిన మరణాల రేటులో ఉన్నాయని పేర్కొంది. చిరుతల సంతతిని- విస్తరించే ప్రయత్నంలో భాగంగా దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి 12చిరుతలను తీసుకువచ్చారు.

గత వందేళ్లలో వేటగాళ్ల దెబ్బతో దేశంలో చిరుతల ఉనికి లేకుండాపోయింది. దీని కారణంగా దేశంలో మళ్లీ చిరుతలను తిరిగి పెంపొందించే కార్యక్రమంలో భాగంగా 12 చిరుతలను తీసుకొచ్చారు. 17 ఫిబ్రవరి 2023న ఇరు దేశాల సహకార ఒప్పందంలో దక్షిణాఫ్రికా 12 చిరుతలను భారతదేశానికి తరలించింది. భారతదేశంలో ఆచరణీయమైన, సురక్షితంగా చిరుతలను ఉంచేందుకు వీలుగా రెండు దేశాల మధ్య సహకారాన్ని ఎమ్ఒయూ సులభతరం చేసింది. చిరుతల సంరక్షణను ప్రోత్సహించడానికి ఈ ప్రాజెక్టు చీతా కార్యక్రమాన్ని చేపట్టారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement