Tuesday, April 30, 2024

Animal – బాలీవుడ్ ను షేక్ చేస్తున్న సందీప్ వంగా, ర‌ణ‌బీర్ క‌పూర్ లు యానిమ‌ల్ టీజ‌ర్ – వీడియోతో

బాలీవుడ్ యంగ్ హీరో ర‌ణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం యానిమ‌ల్ . ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది. ఇదిలా ఉండ‌గా నేడు రణబీర్ కపూర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు . యానిమల్ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ మూవీలో రణబీర్ కపూర్ మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ కనిపించనున్నారు. అలాగే విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఈ మూవీలో రణబీర్ యంగ్ లుక్ తో పాటు రా అండ్ రస్టిక్ లుక్ లోనూ కనిపించనున్నాడు. ఈ సినిమాను కూడా అర్జున్ రెడ్డి తరహాలో తెరకెక్కిస్తున్నాడు సందీప్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement