Saturday, April 27, 2024

అమ్మ బైలెల్లినాది అంటూ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ శుభాకాంక్షలు

బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభకాంక్షలు తెలిపారు ఏపీ రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బోనాల ఉత్సవాలు అని పేర్కొన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. “అమ్మ బైలెల్లినాది” అంటూ ఆండ్రూ ఫ్లెమింగ్ తెలుగులో ట్వీట్ చేశారు. రెండేళ్లకిందట తాను బోనాల వేడుకల్లో పాల్గొన్నప్పటి ఫొటోను కూడా షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement