Wednesday, May 1, 2024

చీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త అరెస్ట్

బుల్లితెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో నర్సింహారెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. 2017లో తన వద్ద నుంచి రూ.కోటి తీసుకుని, తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని నర్సింహారెడ్డిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని… లైంగిక వేధింపులకు కూడా గురి చేశాడని తన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఈ వ్యవహారంలో సెటిల్‌మెంట్ చేసుకోవాలని మరో మహిళ కూడా రాయబారం నడిపిందని ఆమె తెలిపింది. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు నర్సింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement