Thursday, May 2, 2024

యాంకర్ ప్రదీప్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ ‘గిఫ్ట్ ఎ స్మైల్’పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా యాంకర్ ప్రదీప్, అతడి స్నేహితులు కలిసి గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు రూ.10 లక్షలను మంత్రి కేటీఆర్‌కు వారు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా యాంకర్ ప్రదీప్, అతడి స్నేహితులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వారితో క‌లిసి దిగిన ఫోటోను కేటీఆర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో కేటీఆర్ రెండేళ్లుగా సహాయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మొదట తన పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ ను ప్రారంభించారు. ఆ స‌మ‌యంలో కొన్ని అంబులెన్సులను ప్రభుత్వాసుపత్రుల‌కు బహుమతిగా ఇచ్చారు. ఇటీవల ఆయ‌న పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్, ఆయన అభిమానులు, కొందరు టీఆర్ఎస్ నేతలు కలిసి కొన్ని స్కూటీల‌ను వికలాంగులకు గిఫ్టుగా అందజేయడం విశేషం.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో ఓటరు నమోదుకు మళ్లీ అవకాశం

Advertisement

తాజా వార్తలు

Advertisement