Thursday, April 25, 2024

‘అవసరమైతే గుండు కొట్టించుకుంటా’.. అన‌సూయ ఓపెన్ స్టేట్ మెంట్..

స్టార్ యాంక‌ర్ అన‌సూయ గుండు కొట్టించుకుంటాన‌ని తెలిపింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ ప‌క్క టీవీ షోలు మ‌రోప‌క్క సినిమాలు ఇలా బిజీగా గ‌డిపేస్తోంది అన‌సూయ భ‌ర‌ద్వాజ్. ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో ఆస్క్‌మీ ఎనీథింగ్‌ సెషన్‌ నిర్వహించింది అనసూయ. ఇందులో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఓ నెటిజన్‌.. పెద్ద సినిమాలో మంచి రోల్‌ వస్తే.. అవసరం అయితే పాత్ర కోసం గుండు కొట్టించుకుంటారా అని ప్రశ్నించారు.

దీనికి తప్పకుండా.. క్యారెక్టర్‌ కోసం అవసరం అయితే గుండు కొట్టించుకుంటా అంటూ అనసూయ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.అన‌సూయ డెడికేష‌న్‌పై స‌ర్వత్రా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. రంగ‌స్థ‌లం చిత్రంలో డీగ్లామ‌ర‌స్‌గా క‌నిపించిన అన‌సూయ ఇప్పుడు.. పుష్ప సినిమాలోని దాక్షాయ‌ణి అనే పాత్ర కోసం మరింత డీ గ్లామ‌ర్ లుక్‌లో క‌నిపిస్తుంది. తాజాగా అన‌సూయ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇందులో నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ క‌నిపించింది అనసూయ . ఆమె లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి www.twitter.com/AndhraPrabhaApp, www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement