Wednesday, May 1, 2024

రాపాకకు నో ఎంట్రీ… ఇట్లు మీ పల్లకి మోసిన జనసైనికులు

జనసేన పార్టీ ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కు వ్యతిరేకంగా ఫ్లిక్సీలు వెలిశాయి. తాము ఏర్పాటు చేసిన సభకు రాపాక రావటానికి అనుమతి లేదని ఫ్లిక్సీలలో జనసైనికులు పేర్కొన్నారు. అంతే కాదు ఫ్లిక్సీ కింద ఇట్లు మీ పల్లకి మోసిన రాజోలు జనసైనికులు అంటూ పేర్కొన్నారు.

ఇక జనసేన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గత కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. జనసేనకు గుడ్ బై చెప్పేసి.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. దీనితో జనసైనికులలో రాపాక పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement