Sunday, May 5, 2024

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ రూ.250పెంపు

ఇంధన ధరల పెంపుతో సామాన్యులను కలవరపరిచిన చమురు సంస్థలు వాణిజ్యవర్గాలపై దృష్టి సారించాయి. తాజాగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భారీగా పెంచాయి. 19కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లపై ఏకంగా రూ.250 పెంచేశాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. పెరి గిన ధరలు ఏప్రిల్‌1 నుంచే అమలు చేయనున్నారు. డొమెస్టిక్‌ సిలిండర్లపై ధరల పెంపు లేకపోవడంతో గృహ వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. సవరించిన ధరల ప్రకారం 19కేజీల సిలిండర్‌ కొత్త ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లిdలో పాత ధర రూ.2003 ఉండగా కొత్త ధర రూ.2253కు చేరింది. కోల్‌కత్తాలో పాత ధర రూ.2087 ఉండగా కొత్త ధర రూ.2351కు చేరుకుంది. ముంబైలో పాత ధర రూ.1955 ఉండగా కొత్త ధర రూ.2205, చెన్నైలో కొత్త ధర రూ.2406. అదేవిధంగా హైదరాబాద్‌లో కొత్త ధర రూ.2460గా ఉంది.
కాగా ఏప్రిల్‌ 1వ తేదీన చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ధరలను సవరించాయి. సోమవారం 14కిలోల ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ధరలో ఎలాంటిమార్పు లేనప్పటికీ, 19కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు మాత్రం భారీగా పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement