Friday, April 26, 2024

ప్రపంచ నేతల్లో మొనగాడు మోడీ.. 77శాతం రేటింగ్‌తో అగ్రస్థానం

ప్రపంచంలో తిరుగులేని నాయకుడు తానేనని భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు నిరూపించుకున్నారు. ప్రపంచ స్థాయి నేతల్లో 77శాతం రేటింగ్‌తో మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 56శాతం రేటింగ్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ద్వితీయ, ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ 41శాతం రేటింగ్‌తో తృతీయ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో కెనడా ప్రధాని ట్రుడో, బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌, జపాన్‌ ప్రధాని కిషిండా నిలిచారు. ”మార్నింగ్‌ కన్సల్ట్‌ పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌” ఈ సర్వే నిర్వహించి, 22 దేశాల అధినేతల రేటింగ్స్‌తో ఫలితాలు విడుదల చేసింది.

గత సర్వే నివేదికల్లో కూడా మోడీ అత్యంత ప్రజాదరణ గల నేతగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 75శాతం రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. తాజా సర్వేలో మోడీ రేటింగ్‌ మరో 2శాతం పెరగడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement