Thursday, April 25, 2024

అనుమతి లేకుండా అమితాబ్‌ పేరు, ఫొటో వాడొద్దు.. ఢిల్లి హైకోర్టు ఆదేశాలు

బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ పేరు, ఫొటోను అనుమతి లేకుండా ఎవరూ ఉపయోగించరాదని ఢిల్లి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమితాబ్‌ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ అధికారులకు, టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లను ఆదేశించింది. నోటీసులిచ్చింది. తన అనుమతి లేకుండా తన మేధో సంపత్తిని వాడుకుంటున్నారంటూ అమితాబ్‌ బచ్చన్‌ ఢిల్లి హైకోర్టులో పిటిషనల్‌ దాఖలు చేయగా, శుక్రవారం దానిపై విచారణ చేపట్టి ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. అమితాబ్‌ అనుమతి లేదా ధ్రువీకరణ లేకుండా ఆయనకున్న సెలబ్రిటీ హోదాను వినియోగించుకోవడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.

”ఇది అమితాబ్‌ బచ్చన్‌ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమే. నటుడి అనుమతి లేకుండానే నటుడి సెలబ్రిటీ హోదాను వాడుకుంటున్నారు. ఇలాంటి కార్యకలాపాల వల్ల నటుడి పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయి” అని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.

- Advertisement -

ఇక పూర్తి వివరాల్లోకెళ్లితే… నకిలీ కౌన్‌ బనేగా కరోడ్‌పతి లాటరీ స్కామ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ ఫొటోలు, వాయిస్‌ను వినియోగిస్తున్నారు. పలు సంస్థలు ఈ విధంగా తన పేరు, ఇమేజ్‌, వాయిస్‌, వ్యక్తిగత లక్షణాలను అనుమతిలేకుండా కమర్షియల్‌గా వాడకుండా చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement