Thursday, May 9, 2024

అమెజాన్ ప్రైమ్ లో .. నేనే వస్తున్నా

తమిళ హీరో ధనుశ్ నటించిన ‘నేనే వస్తున్నా’ విడుదలై రిజల్ట్ ఎలా ఉన్నా ఈ చిత్రంలో ధనుష్‌ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. డ్యూయల్‌ రోల్‌లో ధనుష్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్ర డిజిటల్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ సంస్థ దక్కించుకుంది. కాగా ‘నేనే వస్తున్నా’ చిత్రాన్ని అక్టోబర్‌ 27 నుండి స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు ప్రైమ్‌ సంస్థ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్‌ రిలీజ్‌కు నాలుగు వారాలకు ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుంది. హార్రర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెల్వా రాఘవన్‌ తెరకెక్కించాడు. అంతేకాకుండా ఓ కీలక పాత్ర కూడా పోషించాడు. ఈ చిత్రాన్ని ‘వి క్రియేష‌న్స్’ ప‌తాకంపై క‌లైపులి ఎస్ థాను నిర్మించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌ సంస్థ రిలీజ్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement