Sunday, May 5, 2024

America: మంచు దుప్ప‌ట్లో అమెరికా…విమానాలు ర‌ద్దు

ఆమెరికా పై మంచు దుప్ప‌టి క‌మ్మేసింది. శీతాకాల‌పు తుపాను ప్ర‌భావంతో ఆమెరికా వ్యాప్తంగా తీవ్ర మంచు అలుముకుంది. దీంతో ప్ర‌జ‌లు జీవ‌నం స్తంభించిపోయింది. అలాగే ర‌వాణ వ్య‌వ‌స్థ కార్య‌కాపాలాలు ఆగిపోయాయి. ముఖ్యంగా మిడ్వెస్ట్, చుట్టు పక్కల రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి.

ఏకంగా 2000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 2400 ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లైట్అవేర్.కామ్’ డేటా స్పష్టం చేసింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో చిక్కుకుపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. చికాగోలోని ఓ’హేర్ అంతర్జాతీయ విమానాశ్రయం 40 శాతం విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇందులో 36 శాతం విమానాలు ఈ ఎయిర్ పోర్టుకు కావాల్సి ఉంది. ఇక చికాగో మిడ్వే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాల్సిన, ఇక్కడికి రావాల్సిన 60 శాతం విమాన సర్వీసులు రద్దయ్యాయి. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మిల్వాకీ మిచెల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో పాటు పలు ఎయిర్పోర్టులు పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ‘737 మ్యాక్స్ 9 విమానాల’ ల్యాండింగ్లో ఇబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఫ్లైట్స్ రద్దు కావడానికి ఒక కారణంగా ఉంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) మార్గదర్శకాలను దృష్టి పెట్టుకొని పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సి వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement