Monday, May 6, 2024

అంబానీ గ్రీన్‌ టార్గెట్‌.. భారీ పెట్టుబడితో ప్రణాళికలు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సరికొత్త వ్యాపారంపై దృష్టిసారిస్తున్నారు. ఇప్పటి వరకు శిలాజ ఇంధనాలు విక్రయిస్తూ.. భారీ లాభాలు ఆర్జించిన అంబానీ.. గ్రీన్‌ ఎనర్జీపై కూడా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మరో భారీ ప్రాజెక్టుతో ముందుకు వెళ్లనున్నట్టు తెలుస్తున్నది. అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ కూడా గ్రీన్‌ ఎనర్జీ దిశగా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించారు. ఇప్పటివరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ద్వారా పెట్రోల్‌, డీజెల్‌, గ్యాసోలిన్‌ అమ్మకాలు జరిగాయి. 2035 నాటికి.. వీటన్నింటిని తప్పించి.. గ్రీన్‌ ఎనర్జీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ భారీ ప్రాజెక్టు సౌదీ అరేబియాలో ప్రతిపాదించబడిన అంతర్జాతీయ ప్లాంట్‌లతో పోటీపడనుంది. శిలాజ ఇంధన అమ్మకాల్లో ఎలా అయితే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందో.. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో కూడా అదే ఊపు కొనసాగించాలని రిల్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ భావిస్తున్నారు. దానికి తగినట్టు వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. దేశంలోనే గ్రీన్‌ ఎనర్జీ రంగంలో అతిపెద్ద తయారీదారుగా నిలవాలని నిశ్చయించుకున్నారు. మిగిలిన పోటీదారులకు భిన్నంగా ఉండాలని భావిస్తున్నారు.

వాతావరణ పరంగా కీలకం..

సరసమైన ధరలకు గ్రీన్‌ ఎనర్జీని అందిస్తూ.. వాతావరణ పరంగా కీలక మార్పులు తీసుకురావాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. పెట్రోలియం కోక్‌ను సింథసిస్‌ గ్యాస్‌గా మార్చి.. దాని నుంచి బ్లూ నైట్రోజన్‌ను తయారు చేయాలనే ఆలోచనలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉంది. దీని కోసం 4 బిలియన్‌ డాలర్లతో నిర్మించిన ఫ్యాకర్టీని వినియోగిస్తున్నది. ఒక కిలో బ్లూ నైట్రోజన్‌ను రూ.90 నుంచి రూ.115 ఖర్చుతో తయారు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే శిలాజ ఇంధనాలను ఉపయోగించి.. బ్లూ హైడ్రోజన్‌ తయారు చేస్తున్నారు. దీన్ని ఉత్పత్తి చేసే సమయంలో విడుదలయ్యే కార్బన్‌ డయాక్సైడ్‌ను రిలయన్స్‌ సంగ్రహిస్తుందని సమాచారం. గ్రీన్‌ హైడ్రోజన్‌ ధరలు సరసమైన ఖర్చుతో నీటి ఎలక్ట్రోలైసిస్‌ ద్వారా రానున్న కాలంలో అందుబాటు ధరలోకి వస్తుందని రిలయన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నది.

కిలోకు రూ.75 చొప్పున!

ముఖేష్‌ అంబానీ.. గ్రీన్‌ ఎనర్జీ తయారీ విషయంలో పక్కా లెక్కలు, ప్రణాళికలు, లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ను సుమారు కిలోకు రూ.75 చొప్పున ఉత్పత్తి చేయనున్నట్టు సమాచారం. ఈ దశాబ్దం నాటికి నేటి ఖర్చుల నుంచి 60శాతం వరకు తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పునరుత్పాదక ఇంధనాల తయారీకి సుమారు 75 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడి పెట్టే ప్రణాళికలను అంబానీ ప్రకటించారు. భారత్‌ ప్రధాని మోడీ మిషన్‌లో భాగంగా దేశాన్ని గ్రీన్‌ ఎనర్జీకి కేంద్రంగా మార్చేందుకు ఈ పెట్టుబడి సహాయపడనుంది.

- Advertisement -

భారీగా తగ్గనున్న ఇంధన ఖర్చు..

గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీ ఖర్చు తగ్గేలోపు.. ఈ వ్యాపారానికి సంబంధించి భారత్‌లో హైడ్రోజన్‌ ఎకో సిస్టమ్‌ను తీసుకొచ్చే తొలి కంపెనీగా రిలయన్స్‌ నిలవనుందని కంపెనీ చెబుతున్నది. తరువాతి కాలంలో సిన్‌ గ్యాస్‌ నుంచి హైడ్రోజన్‌ ఉత్పత్తులకు బదులుగా.. గ్రీన్‌ హైడ్రోజన్‌ను వినియోగిస్తారని, సిన్‌ గ్యాస్‌ మొత్తాన్ని కెమికల్స్‌ రూపంలో మార్చే విధంగా రిలయన్స్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement