Wednesday, May 1, 2024

స్పేస్ టెక్నాలజీ రంగంలో అమెజాన్.. “ప్రాజెక్ట్ కైపర్”తో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు.

అతిపెద్ద ఈ కామర్స్ వేదిక అమెజాన్ ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ సహా పలు ఇతర రంగాల్లో విస్తరించి ఉంది. త్వరలోనే శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని ప్రారంభించేందుకు ప్రాజెక్ట్ కైపర్‌కు శ్రీకారం చుడుతోంది. ఇండియాలో సైతం ప్రారంభించేందుకు వీలుగా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది.

శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవల వ్యాపారంలో ఇప్పటికే ఎలాన్ మస్క్ ఉన్నారు. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ అంటే అంతరాయం లేకుండా అత్యంత వేగంగా ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. దీనికోసం లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో అమెజాన్ 3236 ఉపగ్రహాలు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇందులో కనీసం సగం గ్రహాల్ని 2026 నాటికి నింగిలోకి ప్రవేశపెట్టాలనేది ఆమెజాన్ లక్ష్యంగా ఉంది. శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా అమెజాన్ సంస్థ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎందుకంటే ఇంటర్నెట్‌కు ఇండియా అతిపెద్ద మార్కెట్. ఇప్పటికీ ఈ రంగంలో చాలా మార్కెట్ స్పేస్ ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వం వన్‌వెబ్, జియో శాటిైలైట్స్‌కు జీఎంపీసీఎస్ అనుమతులు మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement