Thursday, May 2, 2024

టీవీ, స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌ భారీ డిస్కౌంట్..

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించింది. అమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్స్‌, ఫ్యాబ్‌ టీవీ ఫెస్ట్‌ సేల్‌ను తీసుకువచ్చింది. ఈ సేల్‌ మార్చి 14తో ముగియనుంది. అమెజాన్‌ ఫ్యాబ్‌ఫోన్స్‌ ఫెస్ట్‌ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌, శాంసంగ్‌, షావోమీ, రియల్‌మీ, ఒప్పో తదితర స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలుదారులకు అందుబాటు లో ఉండనున్నాయి. స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్స్‌కు హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌కార్డులపై 10శాతం తగ్గింపు ఉంటుంది. కాగా స్మార్ట్‌టీవీలపై అత్యధికంగా 55శాతం మేర తగ్గింపును అమెజాన్‌ ప్రకటించిం ది. ప్రైమ్‌మెంబర్స్‌కు రూ.20వేల వరకు బెనిఫిట్స్‌ అందనున్నాయి.

స్మార్ట్‌ఫోన్లులో వన్‌ప్లస్‌ 9ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌ (8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌) 15శాతం తగ్గింపుతో రూ.33,999కు అందజే యను న్నారు. వన్‌ప్లస్‌ 9ప్రో స్మార్ట్‌ఫోన్‌ 12శాతం తగ్గింపుతో రూ.56,999కు కొనుగోలు చేయవ చ్చు. వన్‌ప్లస్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ 14శా తం తగ్గింపుతో రూ.42,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌కు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ రూ.16,550 రానుండటంతో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.26,449కు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్‌ 32అంగుళాల వై సిరీస్‌ హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్‌ ఆండ్రాయిడ్‌ టీవీ రూ.15,999కి కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్‌ 43అంగుళాల క్రిస్టల్‌ 4కే సిరీస్‌ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ రూ.36,990కి కొనుగోలు చేయవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement