Sunday, April 28, 2024

ప్రత్యేక రైళ్లన్నీ ఇక సాధార‌ణ‌మే.. ఏప్రిల్ 1 నుంచి రెగ్యుల‌ర్ నెంబ‌ర్ల‌తో న‌డుస్తాయ‌న్న రైల్వే

అమరావతి, ఆంధ్రప్రభ: కొవిడ్‌ పరిస్థితుల అనంతరం ప్రత్యేక రైళ్లుగా నడిచిన సర్వీసులు ఇక నుంచి గతంలో మాదిరిగా సాధారణ నంబర్లతో నడవనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పలు స్పెషల్‌ రైళ్లను ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి రెగ్యులర్‌ నంబర్లతో నడుపుతున్నట్లు ప్రకటించింది. అకోలా- పూర్ణ, పూర్ణ- అకోలా మధ్య 07573, 74 నంబర్లతో నడిచిన రైళ్లు 17683, 84గా, 07265 కాకినాడ పోర్టు- విశాఖపట్నం ఇకపై 17267గా మారనున్నాయి. అలాగే 07266 విశాఖపట్నం- కాకినాడ పోర్టు 17268గా, కాకినాడ పోర్టు- విజయవాడ 17258గా, కాజీపేట- సిర్పూర్‌ టౌన్‌ 17003గా, సిర్పూర్‌ భద్రాచలం 17034గా, భద్రాచలం- బల్లార్షా 17033, బల్లార్షా- కాజిపేట 17004, విజయవాడ- కాకినాడ టౌన్‌ 17257, విజయవాడ- గూడూరు 17260, గూడూరు- విజయవాడ 17259, కాచిగూడ- గుంటూరు 17254, గుంటూరు- కాచిగూడ 17253, కాచిగూడ- రాయ్‌చూర్‌ 17693, రాయ్‌చూర్‌- కాచిగూడ 17694గా పాత నెంబర్లతో ప్రయాణించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement