Wednesday, May 1, 2024

శాసన సభాపక్ష నేతగా అఖిలేష్‌.. ఏకగ్రీవంగా ఎన్నిక

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లిలో ఎస్‌పీ శాసన సభాపక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఎస్‌పీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులందరితో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌పీ శాసనసభా పక్ష నేతగా అఖిలేష్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని.. ప్రతిపక్ష నేతను ఎన్నుకునే ప్రక్రియ అసెంబ్లిలోనే జరుగుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్‌ ఉత్తమ్‌ పటేల్‌ తెలిపారు.

లోక్‌సభకు అఖిలేష్‌ రాజీనామా చేసి.. స్పీకర్‌ ఓం బిర్లాకు అందజేశారు. లోక్‌సభకు ఆజంగఢ్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్హాల్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో… సమాజ్‌వాదీ పార్టీ ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లిd ఎన్నికల్లో.. సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలను కైవసం చేసుకుంది. 2017లో 47 స్థానాలు మాత్రమే గెలుచుకోగా.. ఈసారి సీట్లను భారీగా పెంచుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement