Friday, May 10, 2024

ఏజెంట్ యాక్ష‌న్….

హీరో అఖిల్‌ అక్కినేని, దర్శ కుడు సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌ పాన్‌ ఇండియా సినిమా ‘ఏజెంట్‌’. ఇటీ-వల విడుదల చేసిన విడుదల చేసిన యాక్షన్‌ గ్లింప్స్‌ కూడా ఆసక్తిని పెంచింది.
త్వరలోనే ‘ఏజెంట్‌’ మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ ప్రారంభిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. హిప్‌హాప్‌ తమిళ సంగీతం అందించిన ‘ఏజెంట్‌’ పాట లు వైభవంగా విడుదల చేయబోతు న్నారు. ఈ సందర్భంగా విడుదల చేసి న ఏజెంట్‌ బ్రాండ్‌ కొత్త పోస్టర్‌ లో అఖి ల్‌ కొత్తగా కనిపించారు.


సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని యూనిక్‌ స్పై థ్రిల్లర్‌ గా రూపొందిం చారు. సాక్షి వైద్య నాయికగా, మమ్ము ట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్‌ ఎల్లోర్‌ కెమరామెన్‌గా పని చేస్తుండగా, హిప్‌ హాప్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్‌ సుంకర, దీపారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్‌ 28న విడుదలౌతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement