Sunday, April 28, 2024

కంబ్యాక్ కి రెడీ అయిన అఖిల్.. UV క్రియేషన్స్‌తో మ‌రో భారీ బ‌డ్జెట్ మూవీ

ఏజెంట్ రూపంలో అక్కినేని అఖిల్ కి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. యువ నటుడు ఈ సినిమా కోసం చాలా కృషి చేసి బాడీ ట్రాన్స్ఫార్మేష‌న్ కూడా చేసుకున్నాడు. అందుకు త‌గ్గ‌ ప్రశంసలను అందుకున్నప్పటికీ, సినిమా స్టోరీ, స్క్రీన్‌ప్లే అనుకుంన్నంత స్థాయిలో లేక‌పోయే స‌రికి బెడిసి కొట్టింది. బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఏజెంట్ సినిమా పిరిస్థితి చాలా గోరంగానే ఉంది.. మెద‌టి రోజునుంచే సినిమాపై మంచి టాక్ లేక‌పోవ‌డంతో.. మూవీకి సరైన ఓపెనింగ్స్ రాలేదు.. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ భారీగా క్రాష్ అయ్యి అఖిల్‌కు మరో ఫ్లాన్ ను తెచ్చిపెట్టింది. ఇది ఖచ్చితంగా అఖిల్‌కి పెద్ద ఎదురుదెబ్బే… అయితే బాక్సాఫీస్ వద్ద తన సత్తాను నిరూపించుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడు అఖిల్.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా.. అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సైన్ అప్ చేసాడు. కాగా, ఏజెంట్ లాగానే ఈసారి కూడా భారీ బడ్జెట్ వ్యవహారం అవుతుందని తెలుస్తొంది. ప్రభాస్ ‘సాహో’ సినిమాలో అసోసియేట్ డైరెక్టర్ & రైటర్‌గా పనిచేసిన అనిల్ కుమార్ ఈ అప్ క‌మింగ్ మూవీకి దర్శకత్వం వహించ‌నున్నారు. ఇక‌ ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ UV క్రియేషన్స్ బ్యాంక్రోల్ చేయ‌నుంది. కాగా, అఖిల్ వరుస పరాజయాల తర్వాత, అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై ఉంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. అయితే ఈ సినిమా ఒక ఫాంటసీ డ్రామాగా తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ జానర్ అఖిల్ కు ఎలా పని చేస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement