Saturday, May 4, 2024

అఖండ టైటిల్ సాంగ్ రోర్ ప్రోమో..

నందమూరి ఫ్యాన్స్ కి శుభవార్త..దీపావళి ట్రీట్ అందింది. అభిమానులు ఎదురు చూస్తున్న అఖండ చిత్రం విడుదల తేదీ గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు మేకర్స్. తాజాగా దీపావళి కానుకగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు . నందమూరి అభిమానులకు దీపావళి గిఫ్ట్ గా అఖండ టైటిల్ సాంగ్ రోర్ అంటూ ఓ చిన్న ప్రోమోను విడుదల చేశారు. పూర్తి లిరికల్ వీడియో సాంగ్ నవంబర్ 8న విడుదల కానుంది.

అఖండలో బాలకృష్ణ అఘోరి పాత్రలో కనిపిస్తారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. నటుడు శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. సింహా, లెజెండ్ తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో వస్తున్న మూడవ చిత్రం “అఖండ”. ప్రముఖ స్వరకర్త ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. “అఖండ” చిత్రానికి ఎం రత్నం డైలాగ్స్ అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement