Saturday, November 27, 2021

అఖండ‌కి ‘సెన్సార్’ స‌ర్టిఫికెట్..డిసెంబ‌ర్ 2న రిలీజ్..

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను తెర‌కెక్కిస్తోన్న చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో హీరోగా బాల‌కృష్ణ న‌టిస్తుండ‌గా..హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ న‌టిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు. బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ కలిగిన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది.ఈ సినిమాను వచ్చేనెల 2వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 27వ తేదీన గానీ .. 28వ తేదీన గాని వైజాగ్ లో జరపాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అక్కడ భారీ వర్షాలతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గినప్పటికీ .. ఆ ప్రభావం నుంచి వాళ్లు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. అందువలన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులోనే శిల్పకళావేదికలో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టుగా స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News