Friday, January 27, 2023

ఎయిర్‌టెల్‌ క్రికెట్‌ ప్లాన్స్‌.. హాట్‌స్టార్‌ బదులు ప్రైమ్‌

ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తన ప్రీ పెయిడ్‌ క్రికెట్‌ ప్లాన్లలో మార్పుులు చేసింది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ స్థానంలో కొత్తగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకు వచ్చింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. ఇవి వేరువేరు ధరల్లో వేర్వేరు వ్యాలిడిటీలతో ఈ ప్యాకేజీలు అభిస్తాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

- Advertisement -
   

ఎయిర్‌టెల్‌ 699 క్రికెట్‌ ప్లాన్‌లో 56 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 3జీబీ డేటా, వంద ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ప్లాన్‌ వ్యాలిడిటీ ఉన్నన్నీ రోజులు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందుబాటులో ఉంటుది. వీటితో పాటు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌, అపోలో సర్కిల్‌, హోలో ట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ లభిస్తాయి. ఇతర ప్లాన్స్‌ వివరాలను ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌లో అభిస్తాయని కంపెనీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement