Monday, April 29, 2024

ఏజెంట్ నుండి టీజ‌ర్ ప్రోమో – ఈ నెల 15న పూర్తి టీజ‌ర్

యంగ్ హీరో అఖిల్ న‌టిస్తోన్న తాజా చిత్రం ఏజెంట్.ఈ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు అఖిల్. కాగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి..కాగా ఏజెంట్ చిత్రానికి వక్కంతం వంశీ స్టోరి అందించినట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఏజెంట్ చిత్రం నుంచి టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రం బృందం. పూర్తి టీజర్ ఈనెల 15న విడుదల కానుంది అని తెలిపింది చిత్ర యూనిట్. ఇక ఈ పిక్చర్ లో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ న‌టిస్తున్నారు..కాగా మాలీవుడ్ (మలయాళ) మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం విశేషం. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఏజెంట్ ఫిల్మ్ కోసం అక్కినేని అఖిల్ బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్ చేశారు. ఈ చిత్రంలో చాలా సర్ ప్రైజెస్ ఉంటాయని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement