Sunday, May 5, 2024

అఫ్టర్ లాంగ్ గ్యాప్ ఐయాం బ్యాక్.. థియేట‌ర్ల‌లో క‌లుసుకుందాం : కింగ్ ఖాన్

బీలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ వెండితెరపై కనిపించి చాలా కాలం అయింది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జీరో’ పరాజయం తర్వాత చాలా కాలం విరామం తీసుకున్నాడు ఖాన్. ప్రస్తుతం షారూఖ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పఠాన్’. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమా యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మిస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్క‌నున్న ఈ మూవీలో జాన్ అబ్రహాం, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాగా, ఈ సినిమా టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు షారూఖ్. ‘‘ఆలస్యం అయ్యిందని నాకు తెలుసు. కానీ, తేదీని మాత్రం తప్పక గుర్తుంచుకోండి. ‘పఠాన్’ సమయం మొదలైంది. థియేటర్ల‌ల్లో కలుసుకుందాం’’ అంటూ కాప్ష‌న్ పెట్టాడు కింగ్ ఖాన్. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఈ మూవీ నిర్మిత‌మౌతున్న ఈ సినిమా జనవరి 25, 2023 నుంచి థియేటర్లల్లో సందడి చేయనుంది. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న 50వ చిత్రమిది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement