Friday, May 3, 2024

శాసన సభ, మండలి బుధవారానికి వాయిదా.. 8 నుంచి 11 వరకు బడ్జెట్‌ పద్దులపై చర్చ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. అసెంబ్లిdలో బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన అనంతరం శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు- స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. శాసన మండలిలోనూ చైర్మన్‌ ఇదే షెడ్యూల్‌ ప్రకటించారు. గతంలో ఉన్న సాంప్రదాయాల ప్రకారం శాసనసభ్యుల అధ్యయనానికి వీలు కల్పిస్తూ సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటి రోజు సెలవు ప్రకటిస్తారు.

బుధవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచీ బడ్జెట్‌ పద్దులపై చర్చ జరగనుంది. 8, 9, 10, 11 తేదీల్లో పద్దులపై చర్చకు అన్ని పార్టీల సభ్యులకు ప్రాధాన్యతా క్రమంలో అవకాశం కల్పిస్తారు. 12వ తేదీన ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించనున్నారు. అనంతరం సమావేశాలు వాయిదా పడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement