Wednesday, May 1, 2024

Adipurush – స‌మాజానికి అధ్యాత్మిక చ‌రిత్ర అవ‌స‌రం – త్రిదండి చిన జియ‌ర్ స్వామి….

తిరుపతి, ప్రభన్యూస్‌: ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.. రాముడి గురించి చాలా సినిమాలు తీసి ప్రేక్షకులకు అందించారు… కానీ ఆ తరం పోయింది. ఈ తరానికి అవసర మైన రాముడు కావాలనే ఉత్సాహంతో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఎంతో భక్తితో, శ్రద్ధతో మనిషి గుండెల్లో దాగివున్న రాముడ్ని బయటకు తీసి చూపించే సినిమానే ఆదిపురుష్‌ అని త్రిదండి చిన జియ్యర్‌ స్వామి అన్నారు. తిరుపతిలో ఎన్‌టీఆర్‌ స్టేడి యంలో మంగళవారం రాత్రి రాముడుగా ప్రభాస్‌, సీతగా కృతి సనన్‌ నటించిన ఆదిపురుష్‌ ప్రిరిలీజ్‌ వేడుకలను ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి చిన జియ్యర్‌ స్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాముడు దేవుడని… భావిస్తున్న తరుణంలో అన్ని జీవరాసుల్లో రాముడు ఉన్నదన్నారు. అయితే మనిషి మనిషిగా జీవించినప్పుడు వారికి శత్రువులు ఉండరన్నారు. ఇప్పటి వరకు రాముని గురించి చాలా సినిమాలు వచ్చినా ప్రస్తుతం ప్రభాస్‌ నటించిన సినిమా అన్ని వర్గాల్లో నూతన నాంది పలుకుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన ఏ-కై-క సినిమా ఆదిపురుష్‌ అన్నారు. మనిషిలో దాగి ఉన్న రామడ్ని బయటకు తీయడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశమని ప్రశంసించారు. రామాయణంలో అరణ్యకాండ, యుద్ధకాండలోని ప్రధాన ఘట్టాలను ఇందులో పొందుపరచి సమాజానికి అవసరమైన ఘటనలను సినిమాలో పొందుపరచడం, ఇప్పటి యువతను సన్మార్గంలో నడిపించే విధంగా సినిమా తీయడంలో కృషి చేసిన డైరెక్టర్‌ ఓమ్‌ రౌత్‌ను అభినందించారు. దేవతలు మంచి మనిషి వెనుక నడుస్తారని… కానీ మనుషులు తప్పుదారిలో నడవకూడదని ఆయన హితవు పలికారు.
టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, రామా యణంలో మంచి ఘట్టాలు తీసుకుని ప్రభాస్‌ సినిమా నిర్మించాడన్నారు. -టైటానిక్‌, బాహుబలి వంటి మంచి సిని మాలు వచ్చినా సమాజానికి ఉపయోగపడే గ్రాఫిక్స్‌లో ఈ సినిమా తీశారన్నారు. యువ తకు ఎంతో ఆదర్శంగా ఉంద న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement