Saturday, May 4, 2024

జబర్దస్త్ కి కొత్త యాంకర్.. అప్పుడే పులిహోర కలపడం మొదలుపెట్టిన ఆది

యాంకర్ ..నటి అనసూయ వెళ్లిపోవడంతో జబర్దస్త్ యాంకర్ స్థానం ఖాళీ అయ్యింది. ఆమె స్థానంలోకి కొత్త యాంకర్ ని తెస్తున్నారని ప్రచారం జరిగింది. ప్రోమోలో కూడా అతిలోక సుందరి తెస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. ఫైనల్ గా రష్మీ ముఖం రివీల్ చేసి ఉసూరుమనిపించారు. జబర్దస్త్ అంటే రెమ్యూనరేషన్ అటూ ఇటూగా ఉన్నా యాంకరింగ్ చేయడానికి రెడీగా ఉన్న అమ్మాయిలో ఎందరో ఉన్నారు. అయినా రష్మీకి వైపే మొగ్గు చూపారు. ఎక్సట్రా జబర్దస్త్ యాంకర్ గా ఉన్న రష్మీని జబర్దస్త్ యాంకర్ చేశారు. కొత్త అమ్మాయిని తేవడానికి నిర్వాహకులు ఆసక్తి చూపలేదు. కొత్తవారు సక్సెస్ కారేమో అని అనుభవం ఉన్న రష్మీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా రష్మీ వ్యవహరిస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ నుండి రష్మి జబర్దస్త్ లో కనిపించదు. ఆమె ఎక్స్ట్రా జబర్దస్త్ కి మాత్రమే పరిమితం అవుతుంది. దానికి కారణం కొత్త యాంకర్ వచ్చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమో ద్వారా నయా యాంకర్ ని పరిచయం చేశారు. జబర్దస్త్ కి కొత్తగా వచ్చిన ఆ యాంకర్ పేరు సౌమ్య రావు. మంచి హైట్, కలర్, స్లిమ్ బాడీతో సూపర్ గ్లామరస్ గా ఉన్నారు. సౌమ్య రావు గ్లామర్ ముందు రష్మీ, అనసూయ సరిపోరు అనిపిస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్లోనే తన మార్కు చూపించింది. కొత్త యాంకర్ కి జడ్జెస్ట్, కమెడియన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.ఇక మొదటి రోజు అని కూడా చూడకుండా కొత్త యాంకర్ పై హైపర్ ఆది పంచ్లతో విరుచుకుపడ్డారు. ఆమె కూడా ఏమాత్రం తగ్గలేదు. నువ్వు యాంకరా? అని హైపర్ ఆది అనగా… నువ్వు కమెడియన్ అయినప్పుడు నేను యాంకర్ కాదా అని పంచ్ వేసింది. స్కిట్ లో సైతం నువ్వు సౌమ్యా కావచ్చు, మాతో పెట్టుకుంటే సేమియానే అంటూ మరో పంచ్ వేశాడు. రష్మీ మాదిరి సౌమ్య తెలుగు అంతంత మాత్రంగానే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement