Friday, May 17, 2024

యాడ్‌, న్స్‌ఇన్సూరెన్స్‌! వాహనాలకు అదనపు కవరేజీ.. థర్డ్ పార్టీతో పాటు ఓన్‌ డ్యామేజ్‌ కవర్‌..

భారతదేశంలోని రోడ్లపై వాహనాలు నడిపించాలంటే.. కచ్చితంగా బీమా ఉండాల్సిందే అని, అయితే ఇన్సూరెన్స్‌ ఎంపికలో కూడా కొన్ని కీలక సూచనలు పాటించాల్సి ఉంటుందని డిజిట్‌ ఇన్సూరెన్స్‌ డైరెక్ట్‌ సేల్స్‌ హెడ్‌ వివేక్‌ చతుర్వేది అభిప్రాయపడ్డారు. రెండు రకాల మోటార్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అందుబాటులో ఉంటాయని, అందులో మొదటిది థర్డ్‌ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్‌. ఇది కేవలం థర్డ్‌ పార్టీ వ్యక్తులు, ఆస్తులకు జరిగిన నష్టాలు, డ్యామేజీలను మాత్రమే కవర్‌ చేస్తుంది. రెండోది ఓన్‌ డ్యామేజ్‌ కవర్‌. ఇది ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనం, ప్రమాదాలతో పాలసీదారునికి కలిగే నష్టాలను కవర్‌ చేస్తుంది. కాంప్రహెన్సివ్‌ కవర్‌ను ఎంచుకుంటే.. థర్డ్‌ పార్టీ లయబులిటీలతో పాటు సొంత డ్యామేజీలను కూడా కవర్‌ చేస్తుంది. కొన్ని యాడ్‌ ఆన్స్‌ ఎంచుకోవడంతో.. వాహనాన్ని మరింత సంరక్షించుకోవచ్చు. పాలసీ తీసుకునే ముందు.. ఐడీవీ తనిఖీ చేయాలి. మీ బండికి నష్టం లేదా డ్యామేజీ సంభవించినప్పుడు బీమా సంస్థ అందించే గరిష్ట విలువ ఐడీవీకి సమానంగా ఉంటుంది. ఐడీవీ అనేది వాహనం మార్కెట్‌ విలువకు సమానం.

పాలసీ ఎంపిక కీలకం..

బీమా రెగ్యులేటరీ ఏర్పాటు చేసిన తరుగుదల ఖర్చును పాలసీలను పోల్చి చూసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ప్రీమియం రేటు ఉండే పాలసీలకు తక్కువ ఐడీవీ ఏర్పాటు చేయబడి ఉంటుంది. అదనపు ధరలకు బీమా సంస్థలు యాడ్‌ ఆన్స్‌ను కూడా అందజేస్తాయి. స్టాండర్డ్‌ ఓన్‌ డ్యామేజ్‌ లేదా థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్‌లో కవర్‌ కాని నష్టాలు యాడ్‌ ఆన్స్‌తో కవర్‌ అవుతాయి. నగరానికి దూరంలో మీ వాహనం ఆగిపోతే.. ఈ యాడ్‌ ఆన్‌ కవర్‌ చేస్తుంది. టైర్‌ పంక్చర్‌ అయినప్పుడు చక్రాలు మార్చడం, డ్యామేజీ అయిన వాహనాన్ని రిపేర్‌ షాప్‌కు తరలించడంలో సహాయపడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు, వాటి వల్ల సంభవించే నష్టాలను స్టాండర్డ్‌ పాలసీ కవర్‌ చేయదు. ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ యాడ్‌ ఆన్‌ ఉంటే మీ వాహనానికి లీకేజీలు, ఇంజిన్‌లో నీరు చేరితే బీమా కవర్‌ చేస్తుంది. రబ్బర్‌, ప్లాస్టిక్‌, ఫైబర్‌ భాగాలకు అయిన మరమ్మతు లేదా మార్పిడి ఖర్చులను నిల్‌ లేదా జీరో డిప్రిషియేష్‌ ప్లాన్‌ భర్తీ చేస్తుంది.

కవర్‌ రిటర్న్‌ టు ఇన్‌ వాయిస్‌ కవర్‌..

కార్‌ ఇన్సూరెన్స్‌లో ఇది ఒక అత్యంత విలువైన కవర్‌ రిటర్న్‌ టు ఇన్‌ వాయిస్‌ కవర్‌. ఈ కవర్‌ మీ కారుకు పూర్తి రేటును నష్టపరిహారంగా అందజేస్తుంది. మీ వాహనం మరమ్మతులు చేయరాని విధంగా డ్యామేజ్‌ అయినప్పుడు ఐడీవీ ఎంత ఉందో అంతమేర పరిహారాన్ని అందజేస్తుంది. ఇక్కడ డిప్రిషియేషన్‌ లెక్కలోకి రాదు. 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వాహనాలకు మాత్రమే ఈ కవర్‌ వర్తిస్తుంది. నట్లు, బోల్టులు, ఆయిల్‌, గ్రీస్‌ వంటి వాటి కంజూమబుల్‌ (మళ్లి మళ్లి వాడాల్సి వచ్చే వస్తువులు) ఖర్చులను కంజూమబుల్‌ యాడ్‌-ఆన్‌తో కవర్‌ చేసుకోవచ్చు. టైర్ల ఖర్చును టైర్‌ ప్రొటెక్షన్‌ కవర్‌తో భర్తీ చేసుకోవచ్చు. కవర్‌ ప్రయోజనం అనేది మీరు ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి ఉంటుంది. మీ వాహనానికి పూర్తి సంరక్షణ కోసం పలు యాడ్‌ ఆన్స్‌తో కూడిన కాంప్రహెన్సివ్‌ ప్లాన్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement