Sunday, April 28, 2024

బంగార్రాజు అప్ డేట్: నాగలక్ష్మి లుక్ కేక

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున బంగార్రాజు సినిమా చేస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమానకు సీక్వెల్‌ గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగచైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో చైతుకి జోగిగా కృతి శెట్టి నటిస్తోంది.  ఈ సినిమాలో కృతి శెట్టి.. నాగ లక్ష్మి పాత్రలో నటిస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ ను మూవీ టీం విడుదల చేసింది. ఈ లుక్‌ లో పల్లెటూరి అమ్మాయి గెటప్‌ లో కృతి శెట్టి అందరిని అలరిస్తోంది. కాగా, కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని నాగార్జున నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement