Tuesday, April 30, 2024

సెల‌బ్రిటీల మ్యారేజీ మామూలుగా ఉండ‌దు.. ఓటీటీల్లో ప్ర‌సారానికి కోట్ల‌లో ఆమ్‌దానీ!

సామాన్యుల ఇంట పెళ్లి అంటే.. ఒక‌టి రెండు రోజుల్లో ముగిసే తంతు.. కానీ, సెల‌బ్రిటీల ఇంట జ‌రిగే పెళ్లి ఇప్పుడు టీవీ, ఓటీటీ ప్ర‌సార హ‌క్కుల‌దాకా వెళ్తోంది. ఇది బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌, కోలీవుడ్‌కి చేరింది. మొన్న‌టికి మొన్న స్టార్‌ హీరోయిన్‌ నయనతార, డైరెక్ట‌ర్‌ విఘ్నేష్ శివన్ పెళ్లికి కూడా ఇట్లాగే జ‌రిగింది. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగగా బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే.. ఈ పెళ్లి వేడుక నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ప్రసారం అయ్యింది.

- Advertisement -

దీని ప్ర‌సారానికి కోట్ల రూపాయలను ముట్ట‌జెప్పి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఇదే ట్రెండ్ ని మరో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఫాలో అవుతోంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న హన్సిక.. తమ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ కు ఇచ్చింది. ఈ టెలికాస్ట్ ను డిస్నీప్ల‌స్‌ హాట్‌స్టార్ ఒక ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

వివాహాలు మన సంస్కృతిలో ప్రత్యేక కార్యక్రమాలు, వధూవరులకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు.. స్నేహితులతో పాటు వారి ఫ్యాన్స్ కి కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో అయితే అభిమానులు సెలబ్రిటీలను త‌మ సొంత ఫ్యామిలీ మాదిరిగానే చూస్తారు. ఇలాంటి సమయంలోనే టీవీ చానెల్‌లు, OTT ప్లాట్‌ఫారమ్‌లు ఈవెంట్‌లను ప్రసారం చేయడానికి ముందుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. త‌ద్వారా మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో యాడ్ రెవెన్యూ ద‌క్కించుకుంటున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement