Monday, May 6, 2024

వెంకీ కుడుముల డైరెక్ష‌న్ లో నితిన్.. క్లాప్ కొట్టిన చిరంజీవి

హీరోగా నితిన్..హీరోయిన్ గా ర‌ష్మిక జంట‌గా న‌టిస్తున్న కొత్త చిత్రాన్ని గ్రాండ్ గా లాంఛ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల రూపొందించ‌నున్నారు. కాగా ఈ చిత్రానికి VNRTrio (వర్కింగ్ టైటిల్‌) పెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమాను గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. VNRTrio పూజాకార్యక్రమాలతో ప్రారంభం కాగా.. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు.ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.ఈ చిత్రానికి టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ యేర్నేని, వై రవి శంకర్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవితో సినిమా చేయాలని వెంకీ కుడుముల చాలా ఏండ్లుగా నిరీక్షిస్తున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవిని ఇంప్రెస్ చేసే సరైన స్క్రిప్ట్‌ రెడీ కాకపోవడంతో వెంకీ, చిరుల కాంబినేషన్‌ సిల్వర్ స్క్రీన్‌పైకి రావడం ఆలస్యమవుతూ వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement