Friday, May 3, 2024

వ్యాక్సిన్ వేయించుకోండి… సోనూసూద్ పిలుపు!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అయితే, కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా టీకా వేయించుకున్నారు. తాజాగా సినీ నటుడు సోనూసూద్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశ ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజల్లో అవగాహనను పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా సోనూసూద్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేస్తూ… అందరూ వ్యాక్సిన్ వేసుకునేలా సోనూ ప్రయత్నించారు. కరోనాకి విరుగుడుగా వ్యాక్సిన్ వచ్చేసిందని, దయచేసి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సోనూసూద్ పిలుపునిచ్చారు.

కాగా, గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాడు సినీ నటుడు సోనూసూద్‌. సినిమాల్లో విలన్‌గా కనిపించే సోనూసూద్‌ రియల్ లైఫ్‌లో మాత్రం హీరోగా మారాడు. పేద ప్రజలకు దేవుడిగా మారిన సోనూసూద్‌కు ఏకంగా గుడినే కట్టించారు ఆయన అభిమానులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement