Sunday, May 19, 2024

హాలీవుడ్ చిత్రంలో స‌మంత‌..ల‌క్కీఛాన్స్ కొట్టేసిందే..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీ బిజీగా గ‌డిపుతోంది. టాలీవుడ్ చిత్రాల‌తో పాటు ప‌లు భాషా చిత్రాల్లో కూడా సంద‌డి చేస్తుంది ఈ బ్యూటీ. కాగా హాలీవుడ్ సినిమాలో న‌టించేందుకు స‌మంత సిద్ద‌మ‌న‌ట్టు టాక్. అరేంజ్ మెంట్స్ ఆఫ్ ల‌వ్ అనే సినిమాలో స‌మంత కీల‌క పాత్ర పోషిస్తోంద‌ట‌. ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత సునీత తాటి నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఫిలిప్ జాన్ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు.రచయిత తిమెరి ఎన్ మురారి నవల అయిన ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ‘అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం.. భార‌త్ లోనూ.. మ‌రికొంత భాగం వేల్స్ లో షూటింగ్ జర‌గ‌నుంది. గ‌తంలో సునీత తాటి నిర్మించిన ఓ బేబీ సినిమాలో స‌మంత న‌టించి, మెప్పించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు శాకినీ ఢాకినీ సినిమా నిర్మాణంలో వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement