Friday, April 26, 2024

ఆది పినిశెట్టి..నిక్కీగ‌ల్రానీల పెళ్లి వీడియో టీజ‌ర్-సంద‌డి చేసిన సందీప్ కిష‌న్ ..మంచు మ‌నోజ్

ఈ మ‌ధ్య‌కాలంలో సినీ సెల‌బ్రిటీల పెళ్లిలు..ఆ పెళ్లికి సంబంధించిన వీడియోలు వైర‌ల్ గా మారుతున్నాయి. కాగా ఈ ఏడాది మేలో వివాహ‌బంధంతో ఒక్క‌ట‌యిన సినీ న‌టులు ఆది పినిశెట్టి..నిక్కిగ‌ల్రానిల వెడ్డింగ్ వీడియో టీజర్ ను విడుదల చేశారు. మా పెళ్లి అయి మూడు నెలలు అవుతుంది. కానీ నిన్ననే ఇదంతా జరిగినట్టుంది. మేం ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది.. దానికి సంబంధించిన మరిన్ని వీడియోలను త్వరలోనే మీ ముందుకు తెస్తాము అంటూ తెలిపారు. ఈ జోడి పెళ్లికి ముందు , పెళ్లి పీటలపై ఎంత సందడి చేసిందో ఈ టీజర్ చూస్తేనే తెలుస్తుంది .ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. నిక్కీ, ఆది తమ పెట్ డాగ్స్ తో ఫోటోలు దిగడం, వధూవరులు లాగా తయారవడం, డాన్స్ చేయడం, హల్దీ ఫంక్షన్ తదితర మధుర ఘట్టాలన్నింటిని ఈ వీడియోలో చాలా షార్ట్ గా చూపించారు. ఇక హీరోలు సందీప్ కిషన్, మంచు మనోజ్ తదితరులు వారికి తోడై వేడుకలలో మరింత జోష్ నింపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement