Thursday, May 2, 2024

గోవాలో గుండెపోటుతో మృతి చెందిన న‌టి

గోవాలో గుండెపోటుతో మృతి చెందింది న‌టి సోనాలి ఫోగ‌ట్.సోనాలి తాజాగా తన సిబ్బందితో కలిసి గోవా వెళ్లారు. అయితే.. నిన్న అర్థరాత్రి గుండె పోటు రావడంతో మరణించారు. దీంతో ఆమె కుటుంబంలో విషాదంలోకి వెళ్లింది.టిక్‌టాక్‌లో కూడా సోనాలి బాగా పాపులర్ అయింది. సోనాలి ఫోగట్ చివరి సారిగా బిగ్ బాస్ 14లో కనిపించింది. సోనాలి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. కాగా… సోనాలి ఫోగట్ బిజెపి నాయకురాలు. ఆమె 2019 హర్యానా ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై అడంపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి మారిన కుల్దీప్ బిష్ణోయ్‌పై ఆమె పోటీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement