Wednesday, May 1, 2024

మ‌రోసారి డ్యాన్స్ తో దుమ్మురేపిన న‌టి ప్ర‌గ‌తి -వైర‌ల్ గా వీడియో

మ‌రోసారి డ్యాన్స్ తో దుమ్మురేపారు న‌టి ప్ర‌గ‌తి. సోషల్ మీడియాలో తమకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తూ ఎప్పుడూ అభిమానులకు దగ్గర‌లోనే ఉంటారు. ప్రగతి తన ఇన్స్టాగ్రామ్ నుండి బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ఒక సాంగ్ కు స్టెప్పులు వేసింది. అయితే ఈమెతో పాటు మరొక అమ్మాయి కూడా స్టెప్పులు వేసింది. ఇక ప్రగతి తో పాటు ఆమె కూడా పోటాపోటీగా స్టెప్పులు వేయడంతో ఈమెను చూసి ప్రగతి కుమార్తె అని అందరూ అనుకున్నారు. దీంతో ప్రగతి బాగా డాన్స్ వేస్తోంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రగతి తో డాన్స్ వేసిన ఈ అమ్మాయి ఆమె కుమార్తె కాదట. ఆ అమ్మాయి పేరు స్నేహ మురళి. ఈమె తమిళ అమ్మాయి కావడం విశేషం. తమిళ ఇండస్ట్రీలో కూడా బాగా పాపులర్ అయిన నటి జయ మురళి కుమార్తె ఈ స్నేహా మురళి. ఈమె కూడా ఒక నటి కావడం చేత ప్రగతి తో కలిసి స్టెప్పులు వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement