Sunday, May 5, 2024

డిప్యూటీ సీఎం అప్పుడే ఎందుకు తీసుకోలేదు?.. సామ్నాలో ప్రశ్నల వర్షం!

మహారాష్ట్ర రాజకీయాలు, బీజేపీ చతురత్వంపై శివసేన అగ్గి ఫైర్​ అవుతోంది. తన కూటమిని చీల్చి, అధికారం చేపట్టాలన్న ఎత్తుగడలను సీరియస్​గా ప్రశ్నిస్తోంది. తమ అధికార పత్రిక సామ్నాలో ఇవ్వాల (శుక్రవారం) దీనిపై పలు ప్రశ్నలను సంధించింది. మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరించినందుకు బీజేపీ లీడర్​ దేవేంద్ర ఫడ్నవీస్‌పై గురి పెట్టింది. అంతేకాకుండా తిరుగుబాటు చేసిన వారిపై అనర్హత వేటు వేయకుండా ఇటు గవర్నర్​, అటు కోర్టులో వెలువరించిన తీర్పును కూడా సామ్నా తప్పుపట్టింది.

2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివసేన, బీజేపీ మధ్య పొత్తు చర్చల గురించి సామ్నా సంపాదకీయంలో ప్రస్తావించారు. “అధికార భాగస్వామ్య ఫార్ములా ఎన్నికలకు ముందు రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి, అప్పుడు వారు  ముఖ్యమంత్రి పదవి కావాలని ఎందుకు అడిగారు.. ఇప్పుడు మాత్రం డిప్యూటీ సీఎం పదవితోనే ఎందుకు సంతృప్తి పొందారు ? అని సామ్నాలో ప్రశ్రించారు. 

ఫడ్నవీస్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించాల్సి వస్తే.. 2019లోదానికి ఎందుకు అంగీకరించలేదన్న క్వశ్చన్​ రైజ్​ చేశారు ఉద్ధవ్​ థాకరే.  ఇంత చేసిన ఫడ్నవీస్​ ముఖ్యమంత్రిగా కావాల్సి ఉంది.. కానీ,  ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.. అని సామ్నాలో అపహాస్యం చేశారు.

“అనైతిక మార్గాల” ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని నీచపు ఆలోచనలతో ఉన్న బీజేపీతో పాటు శివసేన తిరుగుబాటు వర్గాన్ని దూషిస్తూ సంపదాయకీయం సాగింది. ఇక.. మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే  తన విధేయులు. మద్దతుదారులుగా చెప్పుకునే వారు తనని రాత్రికి రాత్రే మోసం చేశారని సంపాదకీయం పేర్కొంది.

ఏక్‌నాథ్ షిండే లేదా బీజేపీ పేరునుపేర్కొనకుండానే సంపాదకీయం సాగింది. “మహారాష్ట్రలో గురువారం ఏం జరిగినా అది అధికారమే సర్వస్వం, మిగతాదంతా అబద్ధం అని రుజువు చేస్తుంది. అధికారం కోసం శివసేనకు మేం ద్రోహం చేయలేదని చెప్పిన వారు తమకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. అది కూడా మొత్తం తిరుగుబాటుతో తమకు సంబంధం లేదని చెప్పిన వారి మద్దతుతో”ఎంత విడ్డూరమో అని హెళన చేశారు.

- Advertisement -

అంతేకాకుండా ఈ సంపాదకీయంలో తిరుగుబాటు ఎమ్మెల్యే అనర్హత వేటుపై స్టే విధించినందుకు సుప్రీంకోర్టుపై కూడా శివసేన దాడి చేసింది. బలపరీక్షకు ఆదేశించినందుకు,  అసమ్మతి వర్గానికి  సపోర్టు చేసిన మహారాష్ట్ర గవర్నర్ బిఎస్ కొత్యారీపై కూడా అందులో దాడి చేసింది. ‘‘పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా.. ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవాలని కోరడం రాజ్యాంగానికి విరుద్ధం. దీనికి అతీతంగా గవర్నర్‌, కోర్టు తీర్పును వెలువరించాయి. కానీ, రాజ్యాంగ పరిరక్షకులు ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలతో ఉన్నప్పుడు.. న్యాయం దక్కాలని కోరుకోవడం కూడా ఆశగా ఉండదనుకుంటా’’ అని ఆ సంపాదకీయంలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement