Saturday, May 4, 2024

రూ. 22వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన విద్యుత్‌ అధికారులు..

ఘట్‌కేసర్‌, ప్రభన్యూస్‌: రూ. 22వేలు లంచం తీసుకుంటూ ఘట్‌కేసర్‌ విద్యుత్‌ ఏఈ రాజనర్సింగ్‌రావు, సబ్‌ఇంజనీర్‌ అశోక్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌ గ్రామంలో రెండు విద్యుత్‌ స్థంబాలు, ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుచేయుటకు ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌ నవీన్‌ వద్ద ఏఈ రాజనర్సింగ్‌రావు రూ. 19వేలు, ఇంజనీర్‌ అశోక్‌ రూ. 3వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేయగా దీంతో బాధితుడు నవీన్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు బాధితుడు నవీన్‌కు ఇచ్చిన డబ్బులను ఏఈ రాజనర్సింగ్‌రావు, ఇంజనీర్‌ అశోక్‌లకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

విద్యుత్‌ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అధికారుల విచారణలో విద్యుత్‌ అధికారుల డిమాండ్‌ నిజమని తేలిందని వారిని అరెస్టు చేసి మంగళవారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరచడంజరుగుతుందని ఏసీబీ డీసీపీ సూర్యనారాయణరావు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement