Friday, May 3, 2024

దెయ్యంగా మారిన‌ మెగాస్టార్ చిరంజీవి..ఎందుకో తెలుసా..

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ చిరంజీవి మాంచి జోరుమీదున్నారు..ప‌లు భారీ ప్రాజెక్టుల‌తో ఆయ‌న బిజీ బిజీగా వున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో కూడా ఆయ‌న చాలా యాక్టీవ్ గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప‌ర్స‌నల్ విష‌యాల‌తో పాటు సినిమా సంగ‌తుల‌ను పంచుకుంటున్న విష‌యం తెలిసిందే. కాగా మెగాస్టార్ ఇప్పుడు దెయ్యం అవ‌తారంఎత్తారు. హ‌లోవీన్ డే సంద‌ర్భంగా చాలా మంది సెల‌బ్రిటీస్ ఫన్ మోడ్‌లో, ఘోస్ట్ గెటప్స్‌లో ఈ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడ‌దే ప‌ని చేశారు చిరంజీవి.

కాగా తాను దెయ్యం గెట‌ప్ఫ లో వున్న వీడియోతో పాటు ఫొటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు మెగాస్టార్. ఇప్పుడవి తెగ వైర‌ల్ అవుతున్నాయి. అంతేకాదు ‘హ్యాపీ హలోవీన్’ అంటూ విషెస్ తెలిపారు. ‘ఉత్కంఠభరితమైన రోజు’ అని కామెంట్ చేశారు. అయితే ఆయన ఈ లుక్ కోసం మేకప్ వేసుకోలేదు. జస్ట్ ఓ యాప్ ఉపయోగించి వీడియో చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆచార్య చిత్రంతో పాటు గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్ లాంటి భారీ ప్రాజెక్టుల‌లో న‌టిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement