Friday, May 10, 2024

‘బ్రో’ మూవీ నుంచి ‘జాణవులే నెరజాణవులే’ సాంగ్ రిలీజ్

YouTube video

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. కాగా, ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ నేడు విడుదల చేశారు.
తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, దర్శకుడు సముద్రకని పాటను లాంచ్ చేశారు. థియేటర్లలో జాణవులే పాటను లాంచ్ చేసి, అభిమానులతో కలిసి వీక్షించారు.

‘జాణవులే నెరజాణవులే’ అంటే సాగే ఈ రొమాంటిక్ గీతాన్ని సాయిధరమ్ తేజ్, కేతికా శర్మపై చిత్రీకరించారు. తమన్ బాణీలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ పాటను తమన్, ప్రణతి ఆలపించారు. ఇటీవలే డబ్బింగ్ కూడా పూర్తి చేసుకున్న ‘బ్రో’ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తో పాటు కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement