Tuesday, April 30, 2024

Follow up | కాకతీయ యూనివర్సిటీకి ఏ ప్లస్‌ గ్రేడ్‌. సంబరాలు చేసుకుంటున్న అధ్యాపకులు, విద్యార్థులు

కేయూ క్యాంపస్‌, ప్రభన్యూస్‌: కాకతీయ యూనివర్సిటీకి నాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ వచ్చింది. ఇటీవల యూనివర్సిటీని తనిఖీ చేసిన నాక్‌ బృందం కాకతీయ విశ్వవిద్యాలయానికి నాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ ఇవ్వడం పట్ల యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు స్వీట్లు పంచుకుని ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్‌, రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రావు కృషితోనే ఏ ప్లస్‌ గ్రేడ్‌ దక్కింది. ఈ సందర్భంగా అధ్యాపకులకు, విద్యార్థులకు, బోధన సిబ్బందికి అభినందనలు తెలిపారు. యూనివర్సిటీ గేట్‌ ఎదుట స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ శ్రీధర్‌కుమార్‌లోథ్‌, డాక్టర్‌ చీకటి శ్రీనివాస్‌, డాక్టర్‌ మధూకర్‌, డాక్టర్‌ పణికాంత్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement